తెలంగాణ

telangana

ETV Bharat / city

పులి కోసం అడవిలో వేట.. 5బృందాలతో జల్లెడ - tiger attcks in telangana

కుమురంభీం జిల్లాలో పులి జాడ కోసం అటవీ అధికారులు విస్తృత గాలింపు చేపట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసి ఆచూకీ కోసం శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిపై దాడిచేసి చంపిన నేపథ్యంలో ప్రజలు ఇంచి నుంచి బయటికి రావాలంటేనే భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

forest officers searching for tiger
పులిజాడ కోసం అడవిని జల్లెడ.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు

By

Published : Dec 2, 2020, 12:07 PM IST

కుమురం భీం జిల్లాలోని ప్రజలను పులి భయం వెంటాడుతూనే ఉంది. దహేగాం, బెజ్జూరు, పెంచికల్‌పేట్‌ మండలాల్లో పులి సంచారం స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దాదాపు 110 గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతాలు, పంటపొలాలకు వెళ్లేవారు పేర్లు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒంటరిగా తిరగొద్దని... గుంపులుగుంపులుగా ఉండాలని ప్రజలకు ధైర్యం చెబుతున్నారు.

5 ప్రత్యేక బృందాలు..

పులి సంచారంతో అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గ్రామాల్లో సర్పంచి నేతృత్వంలో స్థానిక బీట్‌ అధికారితో సహా 10 మంది బృందంగా ఏర్పడి పులిజాడ కోసం వెతుకుతున్నారు. అటవీ శాఖ నుంచి 5 ప్రత్యేక బృందాలు అడవుల్లో పులి కదలికలను పర్యవేక్షిస్తున్నాయి. కొండపల్లి అటవీ ప్రాంతంలో 3 ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేశారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

గత నెల 11న దహేగాం మండలం దిగడలో ఓ వ్యక్తిని పులి దాడి చేసి చంపేసింది. ఈ ఘటన మరువకముందే పెంచికల్‌పేట్‌ మండలం కొండపల్లిలో పత్తి తీయడానికి వెళ్లిన యువతిని లాక్కెళ్లింది. పక్కనే ఉన్నవారు భయంతో కేకలు పెట్టగా.. వదిలేసి పారిపోయింది. అప్పటికే ఆ యువతి చనిపోయింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.

ఇవీ చూడండి:పెళ్లిలో మాంసం పెట్టలేదని గొడ్డలితో హత్య

ABOUT THE AUTHOR

...view details