ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి సంచారం నేపథ్యంలో... అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. అటవీ ప్రాంతాల సమీపంలోని ప్రజలను నిత్యం కలుస్తూ అవగాహన కల్పిస్తున్నారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని జిల్లేడ, వేమనపల్లి, కళ్ళంపల్లి గ్రామాల్లో రైతులు, కూలీలకు అధికారులు అవగాహన కల్పించారు. వ్యవసాయ పనులు చేసేప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కృష్ణపల్లి రేంజర్ గోవిందు, చందు, సర్దార్, డిప్యూటీ రేంజర్ బాబు పటేకర్ పాల్గొన్నారు.
పులి సంచరిస్తోంది.. అప్రమత్తంగా ఉండాలి: అటవీ అధికారులు - పులిసంచారంపై అటవీ అధికాలు అవగాహన కార్యక్రమం
పులి సంచరిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని... అటవీ అధికారులు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో అవగాహన కల్పించారు.
పులి సంచరిస్తోంది.. అప్రమత్తంగా ఉండాలి: అటవీ అధికారులు
Last Updated : Dec 10, 2020, 8:46 PM IST
TAGGED:
పులి సంచారంపై అవగాహన