తెలంగాణ

telangana

ETV Bharat / city

రాజాదేవ్​సా వంశీయుల ఆధ్వర్యంలో దసరా వేడుకలు - adilabad azency area dussehra celebrations

ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. డోలు వాయిద్యాల నడుమ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఉట్నూర్ మండలం లక్కారం గ్రామానికి చెందిన రాజాదేవ్​సా వంశస్థులు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ రీతిలో వేడుకలు జరిపారు.

dussehra celebrations at adilabad azency area
రాజాదేవ్​సా వంశీయుల ఆధ్వర్యంలో దసరా వేడుకలు

By

Published : Oct 25, 2020, 8:18 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాలు.. ఉట్నూర్, జయనగర్, నార్నూర్, గాదిగూడతోపాటు పలు ప్రాంతాల్లో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. ఆయా మండల కేంద్రాల్లోని పోలీస్​స్టేషన్లలో ఎస్సైలు, సీఐల ఆధ్వర్యంలో పోలీసులు ఆయుధపూజ చేశారు.

ఆదివారం సాయంత్రం ఉట్నూర్ మండల కేంద్రంలోని హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక రామాలయం చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉట్నూర్ మండలం లక్కారం గ్రామానికి చెందిన రాజాదేవ్​సా వంశస్థులు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ రీతిలో పూజలు చేశారు. డోలు వాయిద్యాల నడుమ జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఇదీ చూడండి: రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details