తెలంగాణ

telangana

ETV Bharat / city

జడ్పీ స్థాయి సంఘంలో రెండు పడక గదుల ఇళ్ల వివాదం - బయటపడ్డ ఆదిలాబాద్ తెరాస నేతల మధ్య విభేదాలు

ఆదిలాబాద్ అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు... జడ్పీ స్థాయి సంఘం సమావేశంలో బయటపడ్డాయి. ఈ సమావేశంలో రెండు పడక గదుల ఇళ్లు నిర్మాణాలపై... జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు గంగాధర్ అధికారులను నిలదీశారు.

disputes come out between adilabad trs party leaders
జడ్పీ స్థాయి సంఘంలో రెండు పడక గదుల ఇళ్ల వివాదం

By

Published : Feb 6, 2021, 4:45 PM IST

ఆదిలాబాద్ జిల్లా పరిషత్‌ స్థాయి సంఘం సమావేశంలో... అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్దన్ అధ్యక్షతన గ్రామీణాభివృద్ధి స్థాయి సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు పడక గదుల నిర్మాణాల్లో జాప్యంపై అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు గంగాధర్ రావు అధికారులను నిలదీశారు. అవసరం ఉన్న చోట ఇళ్లు కేటాయించకుండా వేరే దగ్గర మంజూరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఇస్తే తప్ప ప్రారంభం కాని ఇళ్లను రద్దు చేసే అధికారం తమకు లేదని నోడల్‌ అధికారి సమాధానం ఇచ్చారు. అలా అయితే ఇంకా పదేళ్లైనా నిర్మాణాలు పూర్తి కావని... అసహనం వ్యక్తం చేశారు. తమకు ఇళ్లు కేటాయించకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. జోక్యం చేసుకున్న జడ్పీ ఛైర్మన్ తగు చర్యలు తీసుకోవాలని... సదరు అధికారిని ఆదేశించగా వివాదం సద్దుమణిగింది.

ఇదీ చూడండి:అటవీశాఖపై సమర శంఖారావానికి రేగా పిలుపు.!

ABOUT THE AUTHOR

...view details