తెలంగాణ

telangana

ETV Bharat / city

నిధులు విడులైనా.. అభివృద్ధిపై నీలి నీడలే..! - ఆదిలాబాద్ అభివృద్ధిపై నీలి నీడలు

అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్‌ బల్దియాలో అభివృద్ధి ఊరిస్తూనే ఉంది. ప్రభుత్వం రూ. కోట్లలో నిధులు మంజూరుచేస్తున్నట్టు ప్రకటిస్తున్నప్పటికీ... క్షేత్రస్థాయిలో ప్రగతి కనిపించడం లేదు. మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ అధికారుల మధ్య సమన్వయ లోపంతో పనుల ముందుకు సాగడంలేదు.

crores of funds release for adilabad development but there is no works
నిధులు విడులైనా.. అభివృద్ధిపై నీలి నీడలే..!

By

Published : Sep 22, 2020, 8:26 AM IST

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో ఇది వరకు 39 వార్డులుండగా... కొత్తగా పెరిగిన 13 వార్డులతో కలిపి 49 అయ్యాయి. 1.55 లక్షలపైచిలుకు జనాభా ఉన్న పట్టణాభివృద్ధి కుంటుపడింది. రహదారులు, మురికి కాలువలు, కల్వర్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం 2017 చివరలో రూ. 27 కోట్లు, 2018లో మరో రూ. 28 కోట్లు విడుదల చేసింది. మున్సిపల్‌, ఆర్​అండ్​బీ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఇంకా పనులు పూర్తి కాలేదు. ఫలితంగా చినుకు పడితే చిత్తడిగా మారుతున్న రహాదారులతో... ప్రజలు రోజూ నరకం చూడాల్సివస్తోంది.

మావల నుంచి చాందా(టి) వరకు ఉన్న పాత జాతీయ రహాదారిపై వెడల్పు, సెంట్రల్‌ లైటింగ్‌ కోసం మరో రూ. 44 కోట్లను మంజూరుచేసినప్పటికీ... పనులు మాత్రం ముందుకు సాగడంలేదు. ప్రధాన వ్యాపార, వాణిజ్య కేంద్రాలతోపాటు శివారు కాలనీల్లోనూ మురికి కాలువల వ్యవస్థ అధ్వాన్నంగా మారింది. తెరుచుకున్న మ్యాన్‌హోల్స్‌ ప్రమాదాలకు దారితీస్తున్నప్పటికీ... అధికార యంత్రాంగంలో మాత్రం చలనం లేదు.

అనుకూలురైన వ్యక్తుల ప్రయోజనాల కోసం రాత్రికి రాత్రే పనుల చేయాలని గుత్తెదారులకు మౌఖిక ఆదేశాలు ఇస్తున్న అధికారులు... అత్యవసరమనుకున్న పనులను పట్టించుకోవడం లేదు. ఫలితంగా నూతనంగా ఏర్పడిన మున్సిపల్‌ పాలకవర్గం సైతం అబాసుపాలు కావాల్సివస్తోంది.

ఇదీ చూడండి:కడంబా అడవుల్లో ఎన్​కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

ABOUT THE AUTHOR

...view details