భారత తొలి ప్రధాని నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పలువురు చిన్నారులు చాచా నెహ్రూ వేషధారణలో పాఠశాలకు వచ్చి ఆకట్టుకున్నారు. విద్యార్థులు చేసిన ప్రదర్శనలు చూపరులను అలరించాయి. చిన్నారులతో ఉపాధ్యాయినులు కదం కలిపి నృత్యం చేశారు. పాఠశాలల్లో పండగ వాతావరణాన్ని తలపించేలా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు.
ఆదిలాబాద్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు - children's celebrations in adilabad
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు చాచానెహ్రూ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి.
![ఆదిలాబాద్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5059362-848-5059362-1573714988576.jpg)
ఆదిలాబాద్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు