తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆదిలాబాద్​ రిమ్స్​కు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వట్లేదు' - kishan reddy visited Adilabad rims hospital

ఆదిలాబాద్‌ రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి.. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా ఇవ్వడం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా కిషన్‌రెడ్డి ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించారు.

central minister kishan reddy visited Adilabad rims hospital
ఆదిలాబాద్​ రిమ్స్​ ఆసుపత్రిలో కిషన్ రెడ్డి

By

Published : Dec 22, 2020, 1:37 PM IST

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆదిలాబాద్​లో పర్యటించారు. రిమ్స్​ ఆసుపత్రిని సందర్శించిన ఆయన.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పరిశీలించారు. వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ సర్కార్ కమిషన్లు వచ్చే పనులే చేస్తుంది తప్ప.. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ఆదిలాబాద్​ రిమ్స్​ ఆసుపత్రిలో కిషన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి రిమ్స్‌ పనులకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్‌ రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి.. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎంపీ సోయం బాపూరావు, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీఓ భవేశ్ మిశ్రా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details