ఆదిలాబాద్‌లో ఫ్లెక్సీల తొలగింపుపై భాజపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. అయోధ్యలో జరగాల్సిన రామాలయ భూమి పూజకు సంబంధించి భాజపా ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా... మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించారు.
ఫ్లెక్సీల తొలగింపుపై భాజపా శ్రేణుల ఆందోళన - రామాలయ భూమి పూజ
ఆదిలాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు ఆందోళనకు దారితీసింది. అయోధ్యలో రామమందిర భూమి పూజ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించటంపై భాజపా శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు ఫ్లెక్సీల ఏర్పాటుకు ఒప్పుకోగా... వివాదం సద్దుమణిగింది.
![ఫ్లెక్సీల తొలగింపుపై భాజపా శ్రేణుల ఆందోళన bjp leaders protest against flexi remove in adhilabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8299501-527-8299501-1596602914494.jpg)
bjp leaders protest against flexi remove in adhilabad
ఈ విషయం తెలుసుకున్న భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పార్టీ శ్రేణులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి అధికారులను నిలదీసే యత్నాన్ని పోలీసులు అడ్డుకోగా స్వల్ప వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత అధికారులు ఫ్లెక్సీల ఏర్పాటుకు ఒప్పుకోవటం వల్ల వివాదం సద్దుమణిగింది.