తెలంగాణ

telangana

ETV Bharat / city

బాసర ఆర్జీయూకేటీ ప్రవేశాలు ఆలస్యం, ఆందోళనలో విద్యార్థులు

Basara RGUKT admissions late నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో కొత్త సమస్య ప్రారంభమైంది. ఈ ఏడాది ఇప్పటివరకు మొదటి సంవత్సరం ప్రవేశాల జాబితా విడుదల కాలేదు. ఈడబ్ల్యూఎస్​ కోటాపై స్పష్టత రాకపోవడం వల్లే ఇలా జరిగిందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

Basara RGUKT
బాసర ఆర్జీయూకేటీ

By

Published : Aug 17, 2022, 12:43 PM IST

Updated : Aug 17, 2022, 12:52 PM IST

Basara RGUKT admissions late: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక జాబితా ప్రకటనలో జాప్యం కొనసాగుతోంది. ఆగస్టు రెండో వారంలో నోటిఫికేషన్‌ ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. దరఖాస్తులు ఎక్కువగా రావడంతో పాటు ఈడబ్ల్యూఎస్​ కోటాపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో తర్జనభర్జన పడుతున్నారు.

ఈ ఏడాది ఈడబ్ల్యూఎస్ కోటాలో 10 శాతం సీట్లు కేటాయించాల్సి రావడంతో... న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. గతేడాది ఆగస్టు మొదటి వారంలోనే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈసారి ఇప్పటివరకు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 17, 2022, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details