తెలంగాణ

telangana

ETV Bharat / city

'మా డిమాండ్లకు ఓకే చెప్పారు.. నేటి నుంచి తరగతులకు హాజరవుతాం' - Basara IIIT Students

Basara Students interview : వారం రోజుల నుంచి బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు చేపట్టిన నిరసనకు తెరపడింది. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డితో స్టూడెంట్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ విద్యార్థులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఇవాళ్టి నుంచి తరగతులకు హాజరవుతామని విద్యార్థులు ప్రకటించారు. విద్యాలయంలో నెలకొన్న సమస్యలు ఒక్కొక్కటిగా దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 15 రోజుల్లో మరోసారి క్యాంపస్‌ సందర్శిస్తానని తెలిపారు. దాదాపు రెండున్నర గంటలకు పైగా చర్చలు జరిగాయి. చర్చల్లో ట్రిపుల్‌ ఐటీ వీసీ, డైరెక్టర్‌, నిర్మల్‌ కలెక్టర్‌, ఎస్పీ పాల్గొన్నారు. ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణం ఇక ఉజ్వలమవుబోతోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న విద్యార్థులతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

Basara
బాసర

By

Published : Jun 21, 2022, 7:09 AM IST

ABOUT THE AUTHOR

...view details