విద్యుదాఘాతంతో 7 పశువులు మృతి
మేతకు వెళ్లిన ఏడు పశువులు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషాద ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో చోటు చేసుకుంది.
విద్యుదాఘాతం వల్ల చనిపోయిన ఎడ్లు
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో విషాదం జరిగింది. ఉదయం మేతకు వెళ్లిన ఏడు పశువులు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచాయి. జంబుగ గ్రామానికి చెందిన ఎడ్లు సమీప పండ్ల మొక్కల ఉత్పత్తి కేంద్రంలోకి వెళ్లాయి. అక్కడ తెగి పడిన ఫీడర్ విద్యుత్ తీగలు తగిలి ఏడు పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. విషయం తెలుసుకున్న రైతులు మనస్తాపానికి గురయ్యారు. అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరిపారు.