తెలంగాణ

telangana

ETV Bharat / city

'నూతన విద్యావిధానంతో అంగన్​వాడీల ఉద్యోగభద్రతకు ముప్పే' - adilabad latest news

ఆదిలాబాద్‌ పట్టణంలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్​వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అంగన్‌వాడీల వేతనాలు పెంచి అర్హులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

anganwadi teachers protest at adilabad icds office
anganwadi teachers protest at adilabad icds office

By

Published : Oct 1, 2020, 9:12 PM IST

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళనబాట పట్టారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయా సమస్యలను ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని చూస్తోందని అంగన్‌వాడీ కార్యకర్తల, హెల్పర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు లింగాల చిన్నన్న ఆరోపించారు.

నూతన విద్యావిధానంతో పాఠశాలల్లో కేంద్రాలను విలీనం చేయాలని చూడటం అంగన్‌వాడీల ఉద్యోగ భద్రతకు ముప్పేనని ఆందోళన వ్వాక్తం చేశారు. అంగన్‌వాడీల వేతనాలు పెంచి అర్హులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాకు ఆయా మండలాల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

ఇదీ చూడండి: ఆదిలాబాద్‌ జిల్లాలో పోషణ్​ అభియాన్‌ ముగింపు వేడుకలు

ABOUT THE AUTHOR

...view details