తెలంగాణ

telangana

ETV Bharat / city

నిలిచిన ప్రసూతి ఆపరేషన్లు... గర్భిణీల నరకయాతన - తెలంగాణ ప్రభుత్వాసుపత్రులు

rims
rims

By

Published : Aug 27, 2021, 8:48 PM IST

Updated : Aug 27, 2021, 9:23 PM IST

20:43 August 27

నిలిచిన ప్రసూతి ఆపరేషన్లు... గర్భిణీల నరకయాతన

నిలిచిన ప్రసూతి ఆపరేషన్లు... గర్భిణీల నరకయాతన

 ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న రిమ్స్‌ ఆస్పత్రిలో గర్భిణీలు నరక యాతన అనుభవిస్తున్నారు. గైనకాలజీ వైద్యులతో పాటు మత్తు మందు ఇచ్చే వైద్యుడు అందుబాటులో లేక ఆపరేషన్ల కోసం రెండు రోజులుగా ఎదురుచూస్తున్నారు. వారి గోడును పట్టించుకునే వారే కరయ్యారు.  ప్రసూతి కోసం వచ్చిన కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరికి చెందిన నిండు గర్భిణిని మత్తు వైద్యుడు లేడని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని సిబ్బంది సూచించారని బాధితులు వాపోతున్నారు.

  హసీనా అనే గర్భిణీ రెండు రోజులుగా కడుపులో ఉన్న పాప చనిపోయిందని, ఆ మృతశిశును తీయమంటే వైద్యులు లేరని చెబుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. కనీసం మందులు ఇచ్చేందుకు వైద్యులు రెండు రోజులుగా రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.  

ఇదీ చూడండి:ఎంపీపీ కుమారుడికి కేటీఆర్​గా నామకరణం చేసిన సీఎం కేసీఆర్​

Last Updated : Aug 27, 2021, 9:23 PM IST

ABOUT THE AUTHOR

...view details