తెలంగాణ

telangana

ETV Bharat / city

చెట్లపై ఆశ్చర్య పరుస్తున్న చీమల గూళ్లు... ఎక్కడో తెలుసా.?

Ant Nests in Nirmal: పిచ్చుకలు గూళ్లు పెడతాయి..! చీమలు పుట్టలు పెడతాయి..! చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఆవాసాలుగా మారతాయి..!! కానీ.. వీటికి భిన్నంగా చీమలు చెట్లపై గూళ్లు కట్టుకుని ఆశ్చర్యపరుస్తున్నాయి. కోగులు అనే రకానికి చెందిన చీమలు కట్టుకున్న గూళ్లను.. ఆ వైపుగా వెళ్లేవాళ్లు ఆసక్తిగా చూస్తున్నారు. ఇంకా ఆలస్యమెందుకు అదెక్కడో మీరే చూడండి.

Ant Nests
చీమల గూళ్లు

By

Published : Mar 25, 2022, 4:07 PM IST

Ant Nests in Nirmal: చెట్లమీద గూళ్లు అనగానే ఏవో పక్షులు అల్లి ఉంటాయని భావిస్తాం. కానీ ఈ చీమలు ఆకులనే ఆవాసంగా చేసుకొని గూళ్లు కట్టుకుని అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తున్నాయి. ఈ అబ్బురపరిచే దృశ్యాలు నిర్మల్ జిల్లాలో కనిపించాయి.

వర్షాలు, గాలులకు చెక్కుచెదరవు..

చీమలు పుట్టలు పెడతాయని అందరికీ తెలుసు. చెట్లపై నివసించే కోగుల రకం చీమలు (ఈకోపిలా జాతికి చెందినవి) మాత్రం గూళ్లు కట్టుకుంటాయి. ఇవి తాము విసర్జించే జిగట లాంటి రసాయనంతో ఆకులను దగ్గరగా చేర్చి అతికిస్తూ గూడుగా మలుస్తాయని నిర్మల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర అధ్యాపకుడు మహ్మద్ ఖలీమ్ తెలిపారు. ఆ గూళ్లు వర్షాలు, ఎండ, గాలులకు కూడా చెక్కుచెదరవని, వాటిలో రాణీ చీమలు నివాసం ఉండి.. సంతానాన్ని వృద్ధి చేస్తాయని ఆయన చెప్పారు. కూలీ చీమలు వాటికి కాపలా కాస్తాయని.. ఇవి తమ మనుగడ కోసం గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయని వివరించారు.

ఆశ్చర్యపరుస్తున్న చీమల గూళ్లు

ఇదీ చదవండి:Irani chai: నేటి నుంచి ‘ఇరానీ చాయ్‌’ ధర రూ.5 పెంపు..

ABOUT THE AUTHOR

...view details