కరోనా కాలంలో విద్యాభివృద్ధి కోసం విద్యార్థులు ఉపాధ్యాయులు సూచించిన సూచనలు పాటించి చదువులో రాణించాలని జడ్పీ ఛైర్మన్ జనార్దన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలకేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ లో జిల్లా విద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డితో కలిసి జడ్పీ ఛైర్మన్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.
'ఉపాధ్యాయుల సూచనలు పాటించి చదువులో రాణించాలి' - ఆదిలాబాద్ లో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన జడ్పీ ఛైర్మన్
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జిల్లా విద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డితో కలిసి జడ్పీ ఛైర్మన్ జనార్దన్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులు సర్కారు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని జనార్దన్ కోరారు.
'ఉపాధ్యాయుల సూచనలు పాటించి చదువులో రాణించాలి'
కరోనా కాలంలోనూ ప్రభుత్వం విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేస్తోందని జడ్పీ ఛైర్మన్ జనార్దన్ తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను సమకూరుస్తోందన్నారు. విద్యార్థులు సర్కారు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా వెంటనే సంబంధిత ఉపాధ్యాయులకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
ఇదీ చదవండి:లేహ్ నుంచి దిల్లీకి ఆకాశమార్గాన అమృత ధారలు