ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో నకిలీ విత్తన దందా జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ స్పష్టంచేశారు. రైతులు అధీకృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేసేలా అధికారులు విస్త్రృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో కలసి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.
Seeds : నకిలీ విత్తన దందా కట్టడికి చర్యలు - fake seeds sales in adilabad district
మహారాష్ట్ర సరిహద్దు కలిగిన ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో నకిలీ విత్తన దందా జరగకుండా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. రాష్ట్ర సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు కర్షకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
![Seeds : నకిలీ విత్తన దందా కట్టడికి చర్యలు fake seeds sales in telangana, fake seeds sales in adilabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:29:53:1622462393-11966227-adb.jpg)
తెలంగాణలో నకిలీ విత్తన దందా, ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తన దందా
రైతులు రసీదులు చూపిస్తేనే పంట వివరాలు నమోదు చేస్తామని అధికారులు తేల్చి చెప్పాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుత సంవత్సరంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని, ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు పాలనాధికారులు నటరాజ్, డేవిడ్, ఆర్టీవో, డీఎస్పీ, వ్యవసాయ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.