కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం మండలం రాంపూర్ గ్రామంలో బొరె హన్మయ్య అనే వృద్ధుడు నివాసముంటున్నాడు. గిరిజనుడైన ఈ రైతుపై 25 ఏళ్ల క్రితం మూడు ఎలుగుబంట్లు దాడి చేసి.. రెండు కనుగుడ్లను పీకేసి అంధుడిని చేశాయి. దీంతో వ్యవసాయం, ఇతర పనులు చేయలేక జీవనాధారం కోల్పోయి.. కుటుంబాన్ని పోషించడానికి ఎన్నో అవస్థలు పడ్డారు. కొన్నేళ్లుగా ఆయన ఇద్దరు కుమారులూ వ్యవసాయం చేస్తూ హన్మయ్యను, ఆయన భార్యను పోషిస్తున్నారు.
మూడు ఎలుగుబంట్లు దాడి.. తలుచుకుంటే గుండెల్లో అలజడి
గడిచిన నెల రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం ఎక్కువైంది. ఆ వార్తలు విన్న హన్మయ్య తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పాతికేళ్ల క్రితం మూడు ఎలుగుబంట్లు హన్మయ్యపై దాడి చేసి.. రెండు కనుగుడ్లను పీకేసి అంధుడిని చేశాయి. జంతువుల దాడికి గురైతే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో తన అనుభవంతో గ్రామస్థులకు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాంతంలో పులి తిరుగుతోంది. ఈ నెలలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జంతువుల దాడిలో ఇద్దరు చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఆ వార్తలు విన్న హన్మయ్య తీవ్ర ఆవేదనకు గురయ్యారు. జంతువుల దాడికి గురైతే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో తన అనుభవంతో గ్రామస్థులకు చెబుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని వివరిస్తున్నారు. అడవి జంతువుల దాడిలో గాయపడిన వారికి అటవీశాఖ పరిహారం ఇస్తుంది. అయితే 25 ఏళ్ల నాటి ఘటన కావడంతో హన్మయ్యకు ఇప్పటివరకూ అలాంటి సాయమేదీ అందలేదు. ఇలాంటి బాధితులపై అటవీశాఖ ఇప్పటికైనా దృష్టిసారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
సంబంధిత కథనాలు: