తెలంగాణ

telangana

ETV Bharat / city

రిమ్స్​లో ఎనిమిది మంది హౌజ్​సర్జన్​లకు కరోనా - ఆదిలాబాద్​లో కరోనా

ఆదిలాబాద్​ జిల్లాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రజలతో పాటు వైద్య సిబ్బంది కూడా వైరస్ బారిన పడుతున్నారు. కరోనా బాధితులకు వైద్యమందించే రిమ్స్​లో ఎనిమిది మంది హౌజ్​ సర్జన్​లకు మహమ్మారి సోకింది. ఆస్పత్రిని నిత్యం శానిటైజ్​ చేయకపోవడం, ఆపరేషన్‌ థియేటర్‌.. ఆరోగ్యశ్రీ వార్డుల పక్కనే ఐసోలేషన్​ వార్డు ఉండటమే వైరస్​ వ్యాప్తికి కారణమని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రిమ్స్​లో ఎనిమిది మంది హౌజ్​సర్జన్​లకు కరోనా
రిమ్స్​లో ఎనిమిది మంది హౌజ్​సర్జన్​లకు కరోనా

By

Published : Jul 28, 2020, 5:32 AM IST

ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా మహామ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 118కి చేరుకుంది. ఇందులో రిమ్స్‌లో పనిచేస్తున్న ఎనిమిది మంది హౌజ్‌సర్జన్లకు పాజిటివ్‌ రావడం వైద్యవర్గాల్లో కలకలం రేకెత్తిస్తోంది. రిమ్స్‌ ఆసుపత్రి రెండో అంతుస్థులో ఉన్న ఆపరేషన్‌ థియేటర్‌, ఆరోగ్యశ్రీ వార్డుల పక్కనే ఐసోలేషన్​ వార్డు ఏర్పాటు చేయడం.. సాధారణ రోగులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా ఎనిమిది హౌజ్‌సర్జన్లు సైతం వ్యాధి బారినపడటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

విధుల నుంచి తప్పుకున్న అధికారులు..

పక్కనే ఉన్న పాత ఆసుపత్రి భవనంలో కొవిడ్‌ వార్డు ఏర్పాటు చేస్తే ఏ ఇబ్బంది ఉండదనే అభిప్రాయం వైద్యవర్గాల్లో వ్యక్తమవుతున్నప్పటికీ అధికారులు స్పందించడంలేదనే ఆరోపణ బలంగా వినిపిస్తున్నాయి. విధులు నిర్వహించే వైద్యులు, వైద్యసిబ్బందికి అవసరమైన గ్లౌజ్‌లు, మాస్కులతో పాటు పీపీఈ కిట్లు సక్రమంగా పంపిణీ చేయడం లేదనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా మూడు రోజుల క్రితమే జిల్లా కొవిడ్‌ నోడల్‌ అధికారి బాధ్యతల నుంచి డా.సందీప్‌ జాదవ్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ పోస్టు నుంచి డా.నరేందర్‌ బండారి, నరేశ్ రాఠోడ్‌ స్వచ్ఛందంగా తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.

స్పందించని ఉన్నతాధికారులు..

ఐసోలేషన్​ వార్డులోనూ శానిటైజేషన్ చేయడం లేదని, అల్పాహారం, భోజనం చివరికి మంచినీళ్లు కూడా సరిగా సరఫరా చేయడం లేదని వ్యాధిగ్రస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించట్లేదని ఆరోపిస్తున్నారు.

ఇవీ చూడండి:సమస్య ఈటీవీకి చేరింది... వెంటనే రోగులకు సాయం అందింది

ABOUT THE AUTHOR

...view details