Zomato, Swiggy, OYO Rooms Register Record Orders And Bookings On New Years Eve : నూతన సంవత్సర వేడుకల సందర్బంగా జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు రికార్డ్ స్థాయిలో ఆర్డర్లను డెలివరీ చేశాయి.
జొమాటో టిప్సే రూ.97 లక్షలు!
జొమాటో ప్లాట్ఫామ్లో 2015 -2020 మధ్య ఎన్ని ఆర్డర్లు అయితే బుక్ అయ్యాయో, అన్ని ఆర్డర్లు ఒక్క 2023 డిసెంబర్ 31నే బుక్ కావడం విశేషం.
"2015 నుంచి 2020 వరకు ఎన్ని ఆర్డర్లు అయితే వచ్చాయో, అన్ని ఆర్డర్లు ఒక్క ఈ డిసెంబర్ 31నే రావడం విశేషం. ఇది మంచి భవిష్యత్‌ను సూచిస్తోంది."
- దీపేందర్ గోయెల్, జొమాటో సీఈఓ
సుమారుగా 3.2 లక్షల మంది జొమాటో డెలివరీ పార్టనర్లు ఈ ఆర్డర్లను బట్వాడా చేశారని కంపెనీ తెలిపింది. కంపెనీ ప్రకారం, అన్నింటి కంటే ఎక్కువగా మహారాష్ట్రలోనే ఆర్డర్లు బుక్ అయ్యాయి. కోల్‌కతాలో ఒక వ్యక్తి ఏకంగా 125 ఐటెమ్‌లను ఆర్డర్ చేశాడు. విశేషం ఏమిటంటే, జొమాటో డెలివరీ బాయ్స్‌కు ఈ ఒక్క రోజులోనే రూ.97 లక్షల మేరకు టిప్స్ లభించాయి.
స్విగ్గీ రికార్డ్ ఆర్డర్స్
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ కూడా డిసెంబర్ 31న రికార్డ్ స్థాయిలో ఆర్డర్లను డెలివరీ చేసింది. వరల్డ్ కప్ ఫైనల్స్ జరిగినప్పుడు వచ్చిన ఆర్డర్లు కంటే, ఏకంగా 1.6 రెట్లు అధికంగా ఇయర్ ఎండ్ ఈవ్ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది.
"వరల్డ్ కప్ ఫైనల్స్ జరిగినప్పుడు వచ్చిన ఆర్డర్లు కంటే, అధికంగా ఇయర్ ఎండ్ ఈవ్ ఆర్డర్లు వచ్చాయి. దీనితో గత రికార్డులు అన్నీ చెదిరిపోయాయి."
- రోహిత్ కపూర్, స్విగ్గీ సీఈఓ