Zomato Layoffs : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం ఉద్యోగుల్లో 3 శాతం మేర ఇంటికి పంపించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైందని.. వివిధ విభాగాలకు చెందిన దాదాపు 100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కొనసాగుతున్న ఉద్యోగాల కోత.. జొమాటోలో 3 శాతం మందికి ఉద్వాసన! - ఫుడ్ డిలివరీ సంస్థ ఉద్యోగుల తొలగింపు
Zomato Layoffs : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కూడా ఉద్యోగుల తొలగింపు ప్రకియను మొదలుపెట్టింది. తన సంస్థ మొత్తం మీద పనిచేసే 3 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నట్లు ప్రకటించింది.
ఉద్యోగాల తొలగించడంపై కంపెనీ సైతం ధ్రువీకరించింది. ఏటా చేపట్టే పనితీరు ఆధారిత మదింపు ప్రక్రియలో భాగంగానే మూడు శాతం తొలగిస్తున్నామని, అంతకు మించి ఏమీ లేదని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. జొమాటోలో ప్రస్తుతం 3,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో జొమాటో నష్టాలు కొంతమేర తగ్గాయి. గతేడాది రెండో త్రైమాసికంలో రూ.430 కోట్లుగా ఉన్న నష్టాలు రూ.251 కోట్లకు దిగి వచ్చాయి. ఈ క్రమంలోనే ఖర్చులను తగ్గించుకుని కంపెనీని లాభయదాకయకత సాధించడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీ ఉద్యోగుల తొలగింపు చేపట్టినట్లు తెలుస్తోంది. అంతకుముందు 2020 మే నెలలో కరోనా సమయంలో దాదాపు 500 మందికి పైగా ఉద్యోగులను జొమాటో తొలగించింది.