తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ అకౌంట్​లో బ్యాలెన్స్ జీరోనా? - అయినా డబ్బులు విత్​డ్రా చేసుకోవచ్చు! - ఓవర్​డ్రాఫ్ట్ ఫెసిలిటీని ఎలా ఉపయోగించాలి

You can Withdraw Money even if Account Balance Zero : మీకు డబ్బు చాలా అత్యవసరం. కానీ మీ అకౌంట్​లో బ్యాలెన్స్ జీరో! ఇలాంటి సమయంలోనూ.. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు!! అవును.. బ్యాంకులు కల్పిస్తున్న "ఓడీ" సౌకర్యంతో మీ ఖాతాలో డబ్బులు లేకున్నా మీరు నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

You can Withdraw Money even if Account Balance Zero
You can Withdraw Money even if Account Balance Zero

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 12:44 PM IST

You can Withdraw Money even if Account Balance Zero : బ్యాంకులో డబ్బులు దాచుకోవడం, అవసరమైనప్పుడు విత్ డ్రా చేయడం మామూలే. కానీ.. మన అకౌంట్లో బ్యాలెన్స్ జీరో అయితే..? అత్యవసరంగా డబ్బులు అవసరమైతే..? స్నేహితులు, తెలిసిన వాళ్ల దగ్గర ట్రై చేస్తారు. అయినా సర్దుబాటు కాకపోతే.. ఏం చేయాలో అర్థంకాక తల పట్టుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి బ్యాంకులు ఓడీ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీని ద్వారా.. జీరో బ్యాలెన్స్(Zero Balance)ఉన్నా కూడా మీరు నగదును పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Overdraft Facility Details in Telugu : బ్యాంకులు కల్పిస్తున్న ఆ సౌకర్యం పేరు ఓవర్​ డ్రాఫ్ట్ (OD)​. చాలా మందికి దీని గురించి తెలియదు. ఈ ఓవర్​ డ్రాఫ్ట్ ఫెసిలిటీ(Overdraft Facility) అనేది షార్ట్ టర్మ్ లోన్. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. బ్యాంకులు కరెంట్ అకౌంట్, సాలరీ అకౌంట్, ఫిక్స్​డ్ డిపాజిట్(Fixed Deposit)​ అకౌంట్లకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు.. షేర్లు, బాండ్లు, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఆస్తి తనఖా, సెక్యూరిటీలు, బంగారం మొదలైన వాటిపై కూడా ఓవర్ డ్రాఫ్ట్(OD) సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

ఈ ఓవర్‌డ్రాఫ్ట్ ఎలా పొందాలి?

ఓవర్ డ్రాఫ్ట్ గురించి బ్యాంకుల నుంచి సమాచారం పొందొచ్చు. బ్యాంకు శాఖను సంప్రదించి కావాల్సిన వివరాలు తెలుసుకోండి. ఒకవేళ మీరు ఓడీకి దరఖాస్తు చేసుకోవాలంటే.. లోన్​కు ఎలాగైతే అప్లై చేసుకుంటామో.. ఓడీకి సైతం అదే విధంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్​ ద్వారా డబ్బులు పొందిన తర్వాత.. గడువులోగా వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది.

పండుగ కోసం షాపింగ్ చేస్తున్నారా? డబ్బులు ఆదా చేసుకోండిలా!

టైమ్​కి చెల్లింపులు చేయాల్సిందే :అనవసరమైన ఖర్చుల కోసం ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీని ఉపయోగించకపోవడమే మంచిది. ఒకవేళ తప్పని సరిగా ఓడీ తీసుకోవాల్సి వస్తే.. ముందుగానే బ్యాంక్ అధికారులతో మాట్లాడండి. ఛార్జీల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మరో ముఖ్యమైన విషయం ఏమంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్​టైమ్​లో తిరిగి చెల్లించేలా చూసుకోండి. ఒకవేళ సమయానికి చెల్లించకపోతే.. బ్యాంకులు భారీగా వడ్డీ వసూలు చేస్తాయని మరిచిపోకండి. పైగా.. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. అందుకే.. టైమ్​కు తప్పక చెల్లించాలి.

మంచి అవకాశమే :ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని సరైన రీతిలో వినియోగించుకుంటే మంచి సౌకర్యమే. అత్యవసర పరిస్థితుల్లో ఖాతాదారులను ఆదుకుంటుంది. ముఖ్యంగా.. బిజినెస్​ చేస్తున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ.. తేడా వస్తేనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల.. అత్యవసరమైతేనే వినియోగించుకోవాలి.. తిరిగి తప్పక చెల్లించగలం అనుకుంటేనే ఓడీకి ఓటేయాలి.

Post Office Saving Scheme : పోస్టాఫీస్ నుంచి అదిరిపోయే స్కీమ్​.. ఎలాంటి రిస్కు లేకుండా డబ్బులు డబుల్..!

ATM Withdraw Issues : ఏటీఎంలో డబ్బులు రాలేదా..? బ్యాంకులు రోజుకు రూ.100 ఇవ్వాల్సిందే..!

ABOUT THE AUTHOR

...view details