Year End Car Discounts : భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ ఇయర్ ఎండింగ్ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ముఖ్యంగా షోరూమ్ డీలర్ల వద్ద ఉన్న స్టాక్లను క్లియర్ చేసేందుకు అదనపు రాయితీలను కూడా ఇస్తున్నాయి. కొత్త కారు కొనాలని ఆశపడేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ ఆర్టికల్‌లో ఎస్యూవీ కార్లపై అందిస్తున్న బెస్ట్ డిస్కౌంట్స్ గురించి తెలుసుకుందాం.
Maruti Suzuki Car Discounts :
ఇండియాలోని అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ అయిన మారుతి సుజుకి తమ వాహనాలపై భారీ రాయితీలను అందిస్తోంది. ఇటీవల అది తీసుకొచ్చిన జిమ్నీ థండర్ ఎడిషన్‌పై ఏకంగా రూ.2 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. దీనికి తోడు భారీగా అమ్ముడుపోయిన గ్రాండ్ విటారా మోడల్పై రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు రాయితీ కల్పిస్తోంది. ఇక మోస్ట్ పాపులర్ కార్ అయిన ఫ్రాంక్స్‌పై రూ.40,000 వరకు ఇయర్ ఎండింగ్ డిస్కౌంట్ అందిస్తోంది.
Hyundai Car Discounts :
హ్యుందయ్ కంపెనీ తమ ప్రీమియం ఎస్యూవీ టక్సన్ డీజిల్ వేరియంట్‌పై రూ.1.5 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే 7 సీటర్ కార్ అయిన అల్కజార్ ఎస్యూవీ పెట్రోల్ వేరియంట్‌పై రూ.35 వేలు, డీజిల్ వేరియంట్‌పై రూ.20 వేల వరకు రాయితీ ఇస్తోంది.
Tata Car Discounts :
టాటా మోటార్స్ సఫారీ, హారియర్, నెక్సాన్ ఈవీ కార్లపై ఇయర్ ఎండ్ డిస్కౌంట్లు అందిస్తోంది. వీటిల్లో హారియర్, సఫారీలపై ఆయా వేరియంట్లను అనుసరించి రూ.1.5 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. టాటా కంపెనీ పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్ అయిన నెక్సాన్ ఈవీ మ్యాక్స్ వెర్షన్‌పై రూ.2.6 లక్షలు, ప్రైమ్ ట్రిమ్స్‌పై రూ.1.9 లక్షల వరకు రాయితీ అందిస్తోంది.
Mahindra Car Discounts :
వాహనాల కొనుగోలుపై చాలా అరుదుగా డిస్కౌంట్లు ప్రకటించే కంపెనీల్లో మహీంద్ర ఒకటి. ఇందులో వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువే. అలాంటిది మహీంద్రా కంపెనీ XUV400 EV టాప్ EL ట్రిమ్ మోడల్పై రూ.4.2 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా ఇందులో ESC ఫీచర్‌ను కూడా అప్డేట్ చేసింది. EC వేరియంట్‌పై రూ.1.7 లక్షల వరకు రాయితీ ఇస్తోంది. XUV300 మోడల్ విషయానికి వస్తే, ఆయా వేరియంట్లను అనుసరించి గరిష్ఠంగా రూ.1.72 లక్షల వరకు రాయితీ కల్పిస్తోంది. ఇవే కాకుండా బొలెరో, బొలెరో నియో మోడళ్లపైనా ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా, వరుసగా రూ.96 వేలు, రూ.1.11 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.