తెలంగాణ

telangana

ETV Bharat / business

Inflation: నాలుగు నెలల గరిష్ఠానికి టోకు ధరల ద్రవ్యోల్బణం

WPI Index 2022: మార్చిలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్ఠాన్ని నమోదు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ముడి చమురు, లోహాలు, నిత్యావసరాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది.

WPI Index 2022
నాలుగు నెలల గరిష్ఠానికి టోకు ధరల ద్రవ్యోల్బణం

By

Published : Apr 18, 2022, 1:56 PM IST

WPI Index 2022: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో నాలుగు నెలల గరిష్ఠానికి చేరి 14.55గా నమోదైంది. ముడి చమురు, వస్తువుల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. వరుసగా 12వ నెలలోనూ టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రెండు అంకెలు దాటింది. ఫిబ్రవరిలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 13.11 శాతంకాగా.. గత ఏడాది మార్చిలో ఇది 7.89 శాతం మాత్రమే. సోమవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో ఆహార వస్తువుల ధరలు 8.19 శాతం నుంచి 8.06 శాతానికి, కూరగాయాల ధరలు 26.93 శాతం నుంచి 19.88 శాతానికి దిగివచ్చాయి. అయితే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా ముడి చమురు, సహజ వాయువు, మినరల్‌ ఆయిల్స్‌, లోహాల ధరల పెరిగి ఫిబ్రవరిలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమైంది. ఫిబ్రవరిలో పెట్రోల్‌ ధరల పెరుగుదల 55.17 శాతం కాగా.. మార్చిలో అది 83.56 శాతంగా ఉంది. మరోవైపు రిటైల్​ ద్రవ్యోల్బణం కూడా మార్చిలో 6.95 శాతంగా నమోదైంది. ఆర్​బీఐ విధించిన ​వినియోగధరల సూచీ పరిమితిని దాటి రిటైల్​ ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇది వరుసగా మూడోసారి.

ఇదీ చూడండి :కుప్పకూలిన దేశీయ సూచీలు.. రూ.3.39లక్షల కోట్ల సంపద ఆవిరి

ABOUT THE AUTHOR

...view details