World Biggest Economy Country 2022 : ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు పోటీనిస్తూ టాప్ 5లోకి దూసుకెళ్లింది భారత్. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అంతకుముందు ఐదో స్థానంలో ఉన్న బ్రిటన్ను కిందకు నెట్టి ఐదో స్థానాన్ని ఆక్రమించింది. అమెరికా డాలర్ల ప్రకారం ఈ అంచనాలను రూపొందించినట్లు ప్రముఖ ఆర్థిక రంగ సంస్థ బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వెల్లడించిన జీడీపీ వివరాల ప్రకారం.. భారత్ మొదటి త్రైమాసికంలో తన ఆధిక్యాన్ని పెంచుకుంది. మితిమీరిన జీవన వ్యయంతో సతమతమవుతున్న బ్రిటన్‌కు.. ఇది ఎదురుదెబ్బేనని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.
అంతకుముందు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సైతం.. భారత్ ఈ ఏడాది చివరకు బ్రిటన్ను అధిగమిస్తోందని అంచనా వేసింది. ప్రస్తుతం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల జాబితాలో.. అమెరికా తొలిస్థానంలో ఉండగా.. చైనా, జపాన్, జర్మనీ, భారత్, బ్రిటన్ తరువాతి స్థానాల్లో ఉన్నాయని ఐఎంఎఫ్ వెల్లడించింది. దశాబ్దం కింద భారత్ 11 స్థానంలో ఉండగా.. బ్రిటన్ ఐదో స్థానంలో ఉంది.
బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం కారణంగా కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకోనున్నారు. దీంతో ప్రదాని పదవి కోసం విదేశాంగ సెక్రటరీ లిజ్ ట్రస్‌తో పోటీపడుతున్నారు మాజీ ఛాన్సలర్ రిషి సునాక్. ఆర్థిక మాంద్యం తలెత్తిన తరుణంలో కొత్తగా ఎన్నికయ్యే ప్రధానమంత్రి వీటిని ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక మాంద్యం 2024 మే వరకు కొనసాగుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అంచనా వేసింది. మరోవైపు ఈ ఏడాది భారత్ ఏడు శాతం మేర తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోనుందని పేర్కొంది.