Women Economic Empowerment Tips : మహిళలు అంటే శక్తి స్వరూపాలు. వారికి సహజ సిద్ధంగానే అనేక నైపుణ్యాలు ఉంటాయి. వాస్తవానికి మగవాళ్ల కంటే మహిళలే చాలా చక్కగా ఆర్థిక నిర్వహణ చేయగలుగుతారు. అయితే కొంత మంది మగువలు మాత్రం.. ఆర్థిక వ్యవహారాలను కేవలం మగవాళ్లు చూసుకునే అంశంగా పరిగణిస్తూ ఉంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. ఆధునిక సమాజంలో మహిళలకు కూడా కచ్చితంగా ఆర్థిక స్వేచ్ఛ ఉండాల్సిందే. అందుకే మహిళలు తమ ఆర్థిక స్వేచ్ఛను కాపాడుకునేందుకు పాటించాల్సిన కీలక అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సరైన ప్రణాళికతో పెట్టుబడులు!
పెట్టుబడులు పెట్టే ముందు కచ్చితంలా లాభ, నష్టాలను అంచనా వేసుకోవాలి. ముఖ్యంగా స్టాక్‌మార్కెట్ పెట్టుబడుల విషయంలో సహనం పాటించాలి. అలాగే ఈక్విటీ పెట్టుబడుల్లో వచ్చే రాబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా మీ ఆర్థిక స్థితి, నష్టాన్ని భరించే శక్తి సహా, మీ ఆకాంక్షలకు అనుగుణంగా సరైన ప్రణాళిక వేసుకొని, అందుకనుగుణంగా పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి. కొంతమంది మగువలు.. తమ స్నేహితులు, బంధువులు చెప్పిన మాటలు విని తమకు ఏమాత్రం అవగాహన లేని పథకాల్లో పెట్టుబడులు పెడతారు. తీరా నష్టపోయి తర్వాత ఇతరులను నిందిస్తూ కూర్చుంటారు. ఇది సరైన విధానం కాదు.
భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవాలి!
మీకు తెలియని, అవగాహన లేని పెట్టుబడి మార్గాల్లో ఎప్పుడూఇన్వెస్ట్చేయకూడదు. అలాగే పెట్టుబడుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య కాలంలో చాలా ఆన్‌లోన్ లోన్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఇలాంటి ట్రాప్‌లో మీరు పడకుండా జాగ్రత్త పడాలి. స్వల్పకాలంలోనే భారీ లాభాలు ఇస్తామని చెప్పేవారిని అస్సలు నమ్మవద్దు. ఇందుకోసం మీరు స్వయంగా ఆర్థిక పరిజ్ఞానం పెంచుకోవాలి. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి.
అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి!
How To Create Emergency Fund :నేటి కాలంలో ఎప్పుడు ఏం అవుతుందో, ఎలాంటి అవసరం వస్తుందో ఊహించలేకపోతున్నాం. అందుకే కచ్చితంగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం మీకు వస్తున్న ఆదాయం, ఖర్చులు, రుణ వాయిదాలు, ఇతర అవసరాలను ఒకసారి కచ్చితంగా లెక్కించుకోవాలి. సులువుగా నగదుగా మార్చుకునే పథకాల్లో కొంత మొత్తం పెట్టుబడిపెట్టాలి. ఇవి అవసర సమయాల్లో అక్కరకు వస్తాయి.
బీమా పాలసీలు ఉండాల్సిందే!
Best Life Insurance Policies For Women : స్త్రీ, పురుషులు అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరికీ బీమా పాలసీలు ఉండాల్సిందే. ఉద్యోగం చేస్తున్నవారికే కాదు. గృహిణులకు కూడా కచ్చితంగా జీవిత బీమా, ఆరోగ్య బీమా ఉండితీరాలి. ఇవి అనుకోని ఇబ్బందులు ఏర్పడినప్పుడు మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటాయి. అత్యవసర నిధి వేరు.. జీవిత బీమా, ఆరోగ్య బీమా వేరు అనే విషయాన్ని చాలా క్లియర్‌గా తెలుసుకోండి.
దీర్ఘకాలిక పెట్టుబడులు!
అత్యవసర నిధి, బీమా అవసరాలు తీరిన తరువాత భవిష్యత్ కోసం పెట్టుబడులుపెట్టుకోవాలి. ఇందుకోసం స్వల్పకాలిక, దీర్ఘకాలిక పొదుపు, మదుపు పథకాలను ఎంచుకోవాలి. షేర్ మార్కెట్ విషయానికి వస్తే దీర్ఘకాల పెట్టుబడులకు ప్లాన్ చేసుకోవాలి. అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి.