ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో మూడో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 2.8 శాతం పెరిగి రూ.3,053 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపింది. గతేడాది ఇదే కాలానికి నికర లాభం రూ.2,969 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. గతేడాదితో పోల్చితే కంపెనీ నికర లాభం 14.3 శాతం పెరిగి.. రూ. 23,229 కోట్లకు చేరుకుందని తెలిపింది. అంచనాలకు మించి లాభాలను నమోదు చేసినట్లు విప్రో వివరించింది.
2023 మార్చి 31తో ముగిసే ఈ త్రైమాసికంలో వృద్ధి రేటు అంచనాను 0.6 నుంచి 1 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది కంపెనీ ఆదాయం 11.5 శాతం నుంచి 12 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. ఈ త్రైమాసికంలో 4.3 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు వచ్చినట్లు సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే తెలిపారు. కంపెనీ లాభాల బాట పట్టినందున ఈక్విటీ షేరుకు రూ.1 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది సంస్థ.