Elon Musk Trump: సాంకేతికత రంగంలోనే సంచలనంగా మారిన ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలుపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్‌మీడియా సంస్థ 'ట్రూత్ సోషల్' కీలక వ్యాఖ్యలు చేసింది. ట్విటర్‌ను కొనాలని మస్క్‌కు ట్రంప్ చెప్పారని పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలను మస్క్ ఖండించారు. ఈ విషయంపై తానెప్పుడూ ట్రంప్‌తో మాట్లాడలేదని స్పష్టం చేశారు. అసలేం జరిగిందంటే..
Truth Social: ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ సీఈఓ డేవిన్ న్యూన్స్ ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ ట్విటర్ కొనుగోలు అంశాన్ని ప్రస్తావించారు. 'ట్విటర్‌ను కొనుగోలు చేయాలంటూ ఎలాన్ మస్క్‌కు ట్రంప్ సూచించారు' అంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన ఓ కథనాన్ని న్యూయార్క్ పోస్ట్ ప్రచురింది. దీంతో ఎలాన్ మస్క్ దీనిపై ట్విటర్ వేదికగా స్పందించారు. 'ఇది పూర్తిగా అవాస్తవం. ట్రంప్‌తో ప్రత్యక్షంగానీ, పరోక్షంగా గానీ నేను ఎప్పుడూ మాట్లాడలేదు' అని తెలిపారు.