తెలంగాణ

telangana

ETV Bharat / business

Why Diesel Engines Does Not Use in Bikes? : బైక్​లలో డీజిల్ ఇంజిన్ ఎందుకు అమర్చరో తెలుసా?.. కారణాలు తెలిస్తే..!

Why Does Not Use Diesel Engines in Bikes : సాధారణంగా కారు కొనేటప్పుడు పెట్రోల్ ఇంజిన్​ది తీసుకోవాలా? లేక డీజిల్ ఇంజిన్​ది కొనాలా అని ఆలోచిస్తాం. కానీ అదే బైక్​ల విషయానికొస్తే కేవలం పెట్రోల్ ఇంజిన్​వి మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఎందుకు బైక్​లలో డీజిల్ ఇంజిన్​ అమర్చరని ఎప్పుడైనా ఆలోచించారా? దానికి గల కారణాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

Bikes
Diesel Engines

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2023, 4:40 PM IST

Why Does Not Use Diesel Engines in Bikes? :ద్విచక్రవాహనం, కారు, బస్సు, ట్రక్, జీప్.. ఇలా అన్నింటికీ వేర్వేరు ఇంధనం అవసరం. వీటిలో కొన్ని వాహనాలకు డీజిల్ వాడతారు.. మరికొన్ని వాహనాలకు పెట్రోల్, డీజిల్ రెండూ వాడతారు. కానీ, బైక్​లలో మాత్రం కేవలం పెట్రోల్​ను ఉపయోగిస్తారు. ఎందుకంటే వాటిలో పెట్రోల్ ఇంజిన్​ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. అయితే మిగతా వాటి మాదిరిగా బైక్​లకు డీజిల్ ఇంజిన్(Diesel Engine) ఎందుకు అమర్చరని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ద్విచక్రవాహనాలలో డీజిల్ ఇంజిన్ ఉపయోగించకపోవడానికి చాలా కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Why Diesel Engines are not Used in Motorcycles :ప్రస్తుతం పెట్రోల్ ఇంజిన్ బైక్ మాత్రమే మార్కెట్లో వాడుకలో ఉంది. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ గతంలో డీజిల్‌తో నడిచే బుల్లెట్ బైక్‌లను విక్రయించేది. కానీ ఇప్పుడు ఆ కంపెనీ డీజిల్ ఇంజిన్‌తో నడిచే ఏ వాహన విక్రయాలు జరపడం లేదు. ఇప్పుడు ఇండియాలో కార్ల వినియోగదారుల కంటే బైక్​లు(New Bikes) వాడే కస్టమర్లే ఎక్కువగా ఉన్నారు. చాలా మంది రోజువారీ అవసరాల కోసం బైక్​లను సౌకర్యంగా ఫీలవుతారు. అలాగే పార్కింగ్​తో రద్దీ రోడ్లపై ఈజీగా ప్రయాణించవచ్చు. అయితే ద్విచక్రవాహనాలకు ఇంత మార్కెట్ ఉన్నప్పటికీ ఆటో మేకర్లు టూ వీలర్‌ మార్కెట్లో డీజిల్ ఇంజిన్ బైక్‌లను ఎందుకు ఉత్పత్తి చేయడం లేదో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Difference Between Diesel and Petrol Engine Bikes :డీజిల్ ఇంజిన్ కంప్రెషన్ నిష్పత్తి 24:1గా ఉంటే అదే పెట్రోల్ ఇంజిన్‌ కంప్రెషన్ నిష్పత్తికి వచ్చేసరికి 11:1గా ఉంది. కాబట్టి బైక్​ను డీజిల్ ఇంజిన్‌తో రూపొందిస్తే.. దాని పరిమాణం, బరువు పెద్దదిగా ఉంటుంది. అందుకే బైక్ లాంటి చిన్న వాహనంలో డీజిల్ ఇంజిన్ వాడటం కష్టంగా ఉంటుంది. అదేవిధంగా డీజిల్ ఇంజిన్లు అధిక కంప్రెషన్ నిష్పత్తిని కలిగి ఉండటంతో.. ఈ ఇంజిన్ నడుస్తున్నప్పుడు, దాని నుంచి వెలువడే శబ్ద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అధిక శబ్దం, వైబ్రేషన్​తో బైక్​ను నడపడం రైడర్లకు అసౌకర్యంగా ఉంటుంది.

Best 5 Bikes for College Students : కాలేజీ విద్యార్థుల కోసం.. అదిరిపోయే ఫీచర్లతో, తక్కువ ధరలో.. బెస్ట్ 5 బైక్స్.!

అలాగే బైక్​లకు డీజిల్‌ ఇంజిన్‌ను అమర్చినట్లయితే ట్యాంక్ పరిమాణం పెద్దదిగా ఉంటుంది. దాంతో బరువు కూడా పెరుగుతుంది. అప్పుడు ఇంజిన్ ధర కూడా ఎక్కువగా ఉంటుంది. దీని ఫలితంగా బైక్ మొత్తం ధర ఎక్కువగా ఉండొచ్చు. దీని కారణంగా డీజిల్ ఇంజిన్​తో తయారు చేసే బైక్​ విడిభాగాల ధర పెట్రోల్ ఇంజిన్ బైక్‌ల కంటే రెట్టింపు అవ్వొచ్చు.

Top Reasons for Diesel Engines Are not Used in Bikes :అదేవిధంగా డీజిల్‌ ఇంజిన్‌ బైక్‌కు మెయింటెనెన్స్‌ ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పెట్రోల్ ట్యాంక్ కలిగిన బైక్ వాడుతున్న యజమాని ప్రతి 3000 కి.మీకి ఇంజిన్‌లోని ఆయిల్‌ను మార్చవలసి ఉంటుంది. ఒకవేళ అదే డీజిల్ ఇంజిన్ అమర్చిన బైక్​ను వాడుతున్నట్లయితే ప్రతి వెయ్యి కిలోమీటర్లకు ఆయిల్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని పెట్రోలు, డీజిల్ ధరల వ్యత్యాసంతో పోల్చి చూస్తే.. పెట్రోల్ మరింత లాభదాయకంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు.

డీజిల్‌ ఇంజిన్‌ బైక్​లు పెట్రోల్ ఇంజిన్ ద్విచక్రవాహనాల కంటే ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. కానీ తక్కువ RPM కలిగి ఉంటాయి. దాంతో ఆ బైక్​లలో పికప్ నెమ్మదిగా ఉంటుంది. RPM తక్కువగా ఉంటే బైక్‌ను మీరు వేగంగా డ్రైవ్‌ చేయలేరు. కానీ, అదే పెట్రోల్ ఇంజిన్ బైక్‌లో RPM ఎక్కువగా ఉండటంతో బైక్‌ వేగాన్ని పెంచవచ్చు. దీని కారణంగానే డీజిల్‌ ఇంజిన్‌ బైక్‌ కంటే పెట్రోల్‌ ఇంజిన్‌ బైక్‌ స్పీడ్‌ ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి. అదేవిధంగా డీజిల్ ఇంజిన్‌కు ఎక్కువ గాలిని పంపడానికి టర్బోచార్జర్ లేదా సూపర్‌చార్జర్ అవసరం. అది చాలా ఖరీదైనది. ఏ కంపెనీ డీజిల్ ఇంజిన్ బైక్ తయారు చేయకపోవడానికి పైన పేర్కొన్న ఈ సాంకేతిక సమస్యలే కారణంగా తెలుస్తోంది.

Honda New Model Launch 2023 : స్టన్నింగ్​ ఫీచర్స్​తో.. హోండా, కేటీఎం డ్యూక్​ బైక్స్​ లాంఛ్​​.. ధర ఎంతంటే?

New Electric Bike In India : స్టన్నింగ్​ ఫీచర్స్​తో టోర్క్​ మోటార్స్​ ఈ-బైక్​ లాంఛ్​.. ధర ఎంతంటే?

For All Latest Updates

TAGGED:

Bikes

ABOUT THE AUTHOR

...view details