తెలంగాణ

telangana

ETV Bharat / business

21 నెలల కనిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం.. రిటైల్ బాటలోనే..

India Wholesale Inflation : గత కొన్ని నెలలుగా కొరకరాని కొయ్యగా మారిన టోకు​ ద్రవ్యోల్బణం ఎట్టకేలకు దిగొచ్చింది. నవంబర్​ నెలలో హోల్​సేల్​ ద్రవ్యోల్బణం 5.85 శాతంగా నమోదైంది.

India Wholesale Inflation
India Wholesale Inflation

By

Published : Dec 14, 2022, 12:55 PM IST

India Wholesale Inflation: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రికార్డ్ స్థాయి కనిష్ఠానికి చేరింది. నవంబర్​ నెలలో టో ద్రవ్యోల్బణం 8.85 శాతంగా నమోదైంది. ఇది 21 నెలల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. ఆహార పదార్థాలు, రసాయనాలు, పేపర్​ ఉత్పత్తులు, టెక్స్​టైల్స్ ధరలు తగ్గడం ఇందుకు దోహదం చేసింది. గత 19 నెలలుగా రెండంకెలుగా ఉన్న టోకు ద్రవ్యోల్బణం.. అక్టోబర్​లో 8.39 శాతానికి తగ్గింది. గతేడాది నవంబర్​లో హోల్​సేల్ ద్రవ్యోల్బణం 14.87గా ఉంది.

ఇటీవలే రిటైల్‌ ద్రవ్యోల్బణం సైతం దిగొచ్చింది. నవంబర్‌ నెలలో వినియోగదారుల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.88 శాతంగా నమోదైంది. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు తగ్గడం ఇందుకు దోహదం చేసింది. 11 నెలల్లో ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. అంతేకాదు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్దేశించుకున్న లక్ష్యానికి 4 (+/-2) శాతానికి లోపే నమోదు కావడమూ గమనార్హం.

గతేడాది నవంబర్‌లో 4.91 శాతంగా ఉన్న వినియోగదారుల ధరల ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం గత కొన్ని నెలలుగా 6 శాతానికి పైనే నమోదవుతూ వస్తోంది. అక్టోబర్‌లో సైతం 6.77 శాతం నమోదైంది. దీంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది. మొత్తంగా 2.25 శాతం మేర పెంచింది. ద్రవ్యోల్బణం కట్టడికి అర్జునుడిలా దృష్టి సారించామని చెప్పిన ఆర్‌బీఐ.. అదుపు చేయడంలో కొంతమేర విజయం సాధించింది. అయితే, రాబోయే 12 నెలలు మాత్రం 4 శాతానికి ఎగువనే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details