Which banks giving Home Loans With Low Interest Rates 2023 :ఈ రోజుల్లోఇల్లు కొనుక్కోవాలన్నా.. కట్టుకోవాలన్నా.. ఎక్కువ మంది బ్యాంకులు ఇచ్చే హోమ్ లోన్లపై(Home Loans)ఆధారపడుతున్నారు. అయితే.. ఒక్కో బ్యాంకు ఒక్కో వడ్డీ రేటును విధిస్తుంటుంది. అందుకే.. ఈ స్టోరీలో.. ఏయే బ్యాంకు ఎంత వడ్డీ రేటుతో రుణాలు అందిస్తుందో ఈ స్టోరీలో చూద్దాం.
These Banks Provide Home Loans at Lowest Interest Rates :హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు అనేవి.. సిబిల్ స్కోరు, వేతనం, కాలవ్యవధి.. మొదలైన వివిధ అంశాల ఆధారంగా ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ వడ్డీ రేట్లలో మార్పులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ఈ రుణాలపై దాదాపుగా అన్ని బ్యాంకులూ ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంట్ ఛార్జీలు వసూలు చేస్తాయి. అలాగే కొన్ని బ్యాంకులు మాత్రం రుణ మొత్తంపై ఇంత శాతం అని, లేదా కనిష్ఠ/గరిష్ఠ ఛార్జీలుగా కొద్ది మొత్తాన్ని వసూలు చేస్తాయి. దీనికి జీఎస్‌టీ అదనంగా ఉంటుంది.
RBI New Rules on Home Loans Save Big: ఇంటి కోసం బ్యాంకు లోన్ తీసుకున్నారా..? లక్షల రూపాయలు ఆదా చేసుకోండిలా!
Home Loans at Low Interest Rates in These Banks :
వివిధ బ్యాంకులు వసూలుచేసే వడ్డీ రేట్లను చూస్తే..
తక్కువ వడ్డీకి హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తున్న వాటిలో ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ(HDFC)ముందు వరుసలో ఉంది. ఇందులో వడ్డీ రేటు 8.50 శాతం నుంచి ప్రారంభమవుతోంది. అలాగే.. ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంకులు కూడా 8.50 శాతం నుంచి గృహ రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. దీని తర్వాత ఐడీబీఐ బ్యాంక్ 8.55 శాతం వడ్డీ రేటుకు లోన్ ఇస్తోంది. అయితే.. మంచి సిబిల్ స్కోర్ ఉండే వ్యక్తులకు ఎల్లప్పుడూ కొంత తక్కువ రేట్లకే హోమ్ లోన్స్ పొందే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.
Cheapest Interest Rates on Home Loans :ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలు 8.60 శాతం నుంచి హోమ్ లోన్స్ ఇస్తున్నాయి. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లలో ఈ గృహ రుణాలపై వడ్డీరేటు 8.70 శాతం నుంచి ప్రారంభమవుతోంది. ఇదే సమయంలో కోటక్ మహీంద్ర బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్‌లు 9 శాతం కంటే తక్కువ రేట్లకు హోమ్ లోన్ అందిస్తున్న జాబితాలో ఉన్నాయి. అధిక వడ్డీరేట్లు కొనసాగుతున్న తరుణంలో ఇతర బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు 9 శాతం వడ్డీకి మించి కూడా లోన్స్ అందిస్తుంటాయి.
అందువల్ల.. హోమ్ లోన్ తీసుకోవాలని భావించేవారు.. తప్పకుండా ఈ వివరాలు తెలుసుకోవాలి. ఏయే బ్యాంకులు ఎంత మొత్తంలో వడ్డీ వసూలు చేస్తాయి? ఏ బ్యాంకులో లోన్ తీసుకుంటే మనకు శ్రేయస్కరం? అన్న విషయాలను ఆలోచించి.. ముందడుగు వేస్తే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఫస్ట్ టైం 'హోం లోన్' తీసుకుంటున్నారా?.. ఈ విషయాలు మస్ట్‌గా తెలుసుకోండి!
హోమ్ లోన్‌కు అప్లై చేద్దామనుకుంటున్నారా?.. వీటిలో ఏది బెటర్?
'హోం లోన్' భారంగా మారిందా.. ఈ జాగ్రత్తలతో ఈజీగా!