Public Vs Private Which Bank Better for Savings Account :ప్రస్తుతం ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల నుంచి.. చాలా వరకు ఆర్థిక లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా అనివార్యమవుతోంది. దీంతో.. అందరూ పొదుపు ఖాతా(Savings Account). ఓపెన్ చేస్తున్నారు. అయితే.. ఏ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేయడం బెటర్? ఎక్కడ మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చు? అనే విషయాలు చాలా మందికి తెలియదు. వివిధ బ్యాంకులు అందిస్తున్న వడ్డీరేట్లు, ఇతర ఫీచర్లను ఓసారి పోల్చి చూసుకోవడంతోపాటు మరికొన్ని వివరాలను పరిశీలించడం ద్వారా.. ఏ బ్యాంకులో పొదుపు ఖాతా ఉత్తమం అనేది ఈజీగా తెలుసుకోవచ్చు.
వడ్డీ రేటు :ఎవరైనా ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసే ముందు.. ఇతర బ్యాంకుల్లో వడ్డీ రేట్లను ఓసారి పోల్చి చూసుకోవడం మంచిది. ఎందుకంటే.. ఇది దీర్ఘకాలంలో పెద్ద అంశం కావచ్చు.
మినిమమ్ బ్యాలెన్స్ : చాలా బ్యాంకుల్లో.. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇది కనీసం రూ. 500 నుంచి గరిష్ఠంగా 5 వేల రూపాయల వరకు ఉండవచ్చు. అయితే.. కొన్ని బ్యాంకులు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఇస్తాయి. అంటే వీటిల్లో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు. వినియోగదారులు తమ అభిరుచి మేరకు ఈ ఖాతాను ఎంచుకోవచ్చు.
నగదు విత్‌డ్రా :చాలా సేవింగ్స్ బ్యాంకులకు నెలవారీ విత్‌డ్రాలో పరిమితులు ఉన్నాయి. ఒక నెలలో అకౌంట్ నుంచి ఎన్ని సార్లు డబ్బు విత్‌డ్రా చేయవచ్చు? అనే దానికి లిమిట్ ఉంటుంది. అందువల్ల.. ఎలాంటి రుసుము లేకుండా ఎక్కువ సార్లు విత్‌డ్రా చేసుకునే సౌలభ్యాన్ని కల్పించే పొదుపు ఖాతాను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
రుసుములు, ఛార్జీలు : సేవింగ్స్ అకౌంట్స్‌కు నెలవారీ రుసుము, క్రాస్-కరెన్సీ మార్క్-అప్, పిన్ రీ-జెనరేషన్ రుసుము.. ఇలా మొదలైన వివిధ రుసుములు ఉంటాయి. అలాగే అకౌంట్ నిర్వహణ రుసుము కూడా ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రతీ సంవత్సరం ఈ అమౌంట్ కస్టమర్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. ఈ నేపథ్యంలో.. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించిన ప్రధాన బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
SBI సేవింగ్స్ అకౌంట్ :ఎస్బీఐ ఖాతాలో.. రూ.10 కోట్ల కంటే తక్కువ ఉన్న బ్యాలెన్స్‌కు ఏడాదికి 2.70 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తారు. 10 కోట్లు అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే.. 3.00 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది.
HDFC బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ : ఇందులో రూ.50 లక్షల కంటే తక్కువ బ్యాలెన్స్‌పై 3% వడ్డీ వస్తుంది. రూ.50 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే 3.50 శాతం మేర వడ్డీ లభిస్తుంది.