తెలంగాణ

telangana

ETV Bharat / business

WhatsApp Pay How to Send and Receive Money Online : వాట్సాప్​లో డబ్బులు పంపొచ్చు.. ఈ విషయం మీకు తెలుసా.! - వాట్సాప్​ పే గురించి విన్నారా

How to Use WhatsApp Payments : మీరు వాట్సాప్ వాడుతున్నారా? అయితే ఈ విషయం మీకు తెలుసా.. మీ వాట్సాప్ ద్వారా ఫోన్ పే, గూగుల్ పే మాదిరిగానే ఇతరులకు డబ్బులు పంపొచ్చు. ఎలా అని ఆలోచిస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం అది ఎలాగో మీరే చూసేయండి..

WhatsApp Pay
WhatsApp Payments

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 7:15 PM IST

How to Set up WhatsApp Pay for Send and Receive Money :నేటి సాంకేతిక యుగంలో డిజిటల్ చెల్లింపులు ఎక్కువ అయిపోయాయి. స్మార్ట్​ఫోన్​ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చెల్లింపులపై ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా ఎవరికైనా భౌతికంగా డబ్బులు మరొకరికి పంపించాలంటే.. అది చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం. అదే డిజిటల్ చెల్లింపులు వచ్చాక ఇలాంటి సమస్యలే లేకుండా పోయాయి. చిటికెలో ఉన్న చోటు నుంచే ఆన్లైన్లో డబ్బులు పంపేయవచ్చు. ఈ క్రమంలో ఫోన్ పే(Phone Pay), గూగుల్ పే(Google Pay) యాప్​ల మాదిరిగానే వాట్సాప్ కూడా పేమెంట్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. మరి, అది ఎలాగో చూద్దాం..

How to Transfer Money on WhatsApp Pay :వివిధ UPI పేమెంట్స్ యాప్స్ అవసరం లేకుండా నేరుగా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకునే వెసులుబాటును వాట్సాప్ కల్పించింది. ఈ UPI ఆధారిత సేవలను అందించడానికి వాట్సాప్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే దేశంలో వ్యక్తుల మధ్య వాట్సాప్ పేమెంట్ సేవలు అందుబాటులోకి రాగా.. ఇటీవల విదేశాలలో ఉన్న వ్యక్తులకు దీని ద్వారా డబ్బులు పంపే అవకాశం వాట్సాప్ కల్పిస్తోంది. వాట్సప్ పేమెంట్ ద్వారా వారి కాంటాక్ట్ లిస్ట్​లోని వ్యక్తులకు ఈజీగా డబ్బు బదిలీ చేయవచ్చు. అయితే ముందు మీరుWhatsApp Payకి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఇతరులకు డబ్బు పంపగలరని, వారి నుంచి స్వీకరించగలరనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు వాట్సాప్ ద్వారా ఏ విధంగా డబ్బులు పంపొచ్చు, ఏ విధంగా అవతలి వారి నుంచి స్వీకరించవచ్చో తెలుసుకుందాం..

How to Send Money on WhatsApp Pay in Online :

వాట్సప్ ద్వారా డబ్బులు ఎలా పంపాలంటే..

  • ముందుగా మీరు ఎవరికి డబ్బు పంపాలనుకుంటున్నారో వారి చాట్‌ని తెరిచి, ఆపై అటాచ్ చేసి చెల్లింపును నొక్కాలి.
  • అనంతరం మీ డెబిట్ కార్డ్ సమాచారాన్ని ధ్రువీకరించడానికి 'Tap to Continue' అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీ డెబిట్ కార్డ్ నంబర్ లాస్ట్ 6 అంకెలు, గడువు తేదీని నమోదు చేయాలి. ఆ తర్వాత 'Done' అనే దానిపై నొక్కి.. UPI పిన్ను సెటప్ చేసుకోవాలి. అయితే, వన్ టైమ్ పాస్​వర్డ్ ముందే ఫిల్ అయిందా లేదా చూసుకోవాలి.
  • ఒకవేళ కాకపోతే మీ ఫోన్కు SMS వస్తుంది. అందులో వచ్చిన OTPని Enter OTP క్రింద టైప్ చేయాలి. మీ మొబైల్కి మరో ఓటీపీ పంపడానికి.. Resend OTPని నొక్కాలి.
  • అనంతరం UPI పిన్ క్రియేట్ చేసుకోవాలి. అలా రూపొందించుకున్న పిన్ను సెటప్ యూపీఐ కింద నమోదు చేసి.. సబ్మిట్ బటన్ను క్లిక్ చేయాలి.
  • అప్పుడు UPI సెటప్ పూర్తయితే.. Done అనే ఆప్షన్​ను నొక్కాలి.
  • ఇప్పుడు మీరు ఎవరికి డబ్బు పంపాలనుకుంటున్నారో వారి చాట్‌ని ఓపెన్ చేసి అటాచ్ చేసి.. ఆపై చెల్లింపును నొక్కాలి.
  • ఆ తర్వాత మీరు ఎంత పంపాలనుకుంటున్నారో ఆ మొత్తాన్ని అక్కడ టైప్ చేయాలి.
  • చివరగా చెల్లింపు కోసం వివరణను నమోదు చేసి.. Send బటన్ను నొక్కాలి.

అయితే.. మీరు చెల్లింపును పంపే ముందు UPI పిన్‌ని టైప్ చేయమని మిమ్మల్ని అడగుతుందనే విషయం మీరు గుర్తుంచుకోవాలి.
అలాగే చెల్లింపు పూర్తి అయిన తర్వాత, మీరు పంపిన లావాదేవీ IDతో సహా దానికి సంబంధించిన వివరాలు చాట్‌లో లిస్ట్ రూపంలో కనిపిస్తాయి. అదేవిధంగా వాట్సాప్ ద్వారా డబ్బులను ఎలా స్వీకరించాలో ఇప్పుడు చూద్దాం..

వాట్సాప్​ బంపర్​ ఆఫర్​.. ఆ ఫీచర్​ వాడితే భారీగా క్యాష్​బ్యాక్​​

WhatsApp Payments ద్వారా డబ్బును ఎలా స్వీకరించాలో చూద్దాం..

How to Receive Money on WhatsApp Payments in Telugu :ముందుగా మీ WhatsAppకి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి ఉంటే మీరు మనీ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే మీరు ఒకవేళ మీ వాట్సాప్కి బ్యాంక్ ఖాతా యాడ్ చేయనప్పుడు డబ్బును స్వీకరించాలంటే ఈ క్రింది విధంగా చేయాల్సి ఉంటుంది.

  • మొదట చెల్లింపును అంగీకరించు ఆప్షన్ను నొక్కాలి.
  • ఆ తర్వాత WhatsApps Payments Terms and Privacy అంగీకరించి కొనసాగించు అనే బటన్ను ప్రెస్ చేయాలి.
  • అనంతరం మీకు వచ్చే SMS ద్వారా ధ్రువీకరించుకోవాలి.
  • అప్పుడు మీకు కనిపిస్తున్న బ్యాంకుల జాబితా నుంచి మీ బ్యాంక్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌తో అనుబంధించబడిన బ్యాంక్ ఖాతాల జాబితా లిస్ట్ చేయడం జరుగుతోంది.
  • అప్పుడు మీరు WhatsAppకి యాడ్ చేయాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాను Tap చేయాలి.
  • చివరిగా Done అనే బటన్ను నొక్కితే మీ ప్రక్రియ పూర్తి అవుతుంది.

WhatsApp Pay ఏఏ బ్యాంక్‌తో పని చేస్తుందంటే..ఈ WhatsApp Pay అనేది ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో సహా UPIకి మద్దతు ఇచ్చే భారతీయ బ్యాంకుల ద్వారా దుబాటులో ఉంటుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్లో సులువుగా వాట్సాప్ పేమెంట్స్ ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు.

Whatsapp HD Photos : వాట్సాప్‌లో HD ఫొటోలను ఎలా పంపాలో తెలుసా?.. ఇదిగో సింపుల్ ప్రాసెస్!

How to Lock Whatsapp Web on PC : మీ ల్యాప్​టాప్​లో వాట్సాప్​ చాట్స్​ ఎవరూ చూడకూడదా?

ABOUT THE AUTHOR

...view details