తెలంగాణ

telangana

ETV Bharat / business

What Is Freedom SIP : మీ పెట్టుబడి 12 రెట్లు పెరగాలా?.. ఫ్రీడమ్​ సిప్ ట్రై చేయండి!

What Is Freedom SIP In Telugu : మ్యూచువల్ ఫండ్స్ అనగానే మనకు రకరకాల ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఎక్కువ మంది సిప్ వైపే మొగ్గు చూపుతారు. కానీ మీరెప్పుడైనా ఫ్రీడమ్ సిప్ గురించి విన్నారా ? అసలు ఈ ఫ్రీడమ్ సిప్ అంటే ఏంటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

freedom SIP benefits
What Is Freedom SIP

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2023, 4:59 PM IST

What Is Freedom SIP : మ్యూచువల్ ఫండ్స్ అనగానే మనకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్​మెంట్ ప్లాన్స్(SIP) గుర్తొస్తాయి. ఒక క్రమపద్ధతిలో మదుపు చేస్తూ.. దీర్ఘకాలంలో మంచి కార్పస్​ పొందాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. సిప్ విధానంలో.. మనకు నచ్చినంత, వీలైనంత సొమ్మును మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​ చేయవచ్చు. అలాగే మనకు అవసరమైనప్పుడు విత్​డ్రా కూడా చేసుకోవచ్చు. అందుకే చాలా మంది SIP విధానాన్ని ఎంచుకుంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఫ్రీడమ్ సిప్ గురించి విన్నారా? అసలు ఫ్రీడమ్ సిప్ అంటే ఏమిటి? సాధారణ SIPకు, ఫ్రీడమ్​ సిప్​కు ఉన్న ప్రధానమైన తేడా ఏమిటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Freedom SIP Benefits : ఐసీఐసీఐ బ్యాంక్​ ఫ్రీడమ్​ సిప్ అనే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఇది సిస్టమాటిక్ ఇన్వెస్ట్​మెంట్ ప్లాన్​ (SIP) + సిస్టమాటిక్ విత్​డ్రావల్ ప్లాన్​ (SWP)ల సమ్మేళనం అని చెప్పవచ్చు.

సిప్ విధానం : మీరు కనుక మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. ముందుగా ఒక నిర్దిష్ట కాలవ్యవధిని ఫిక్స్ చేసుకోవాలి. ఉదాహరణకు 8 ఏళ్లు/ 10 ఏళ్లు/ 12 ఏళ్లు /15 ఏళ్లు.. ఇలా ఒక నిర్దిష్ట కాలవ్యవధిని ఎంచుకోవాలి. ఈ సమయంలో మీరు ఒక పద్ధతి ప్రకారం, నిర్దిష్ట మొత్తాలను మదుపు చేస్తూ ఉండాలి. మీరు అనుకున్న టెన్యూర్ పూర్తి అయిన తరువాత మీకు పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. ఇదే SIP విధానం. అయితే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్​ మ్యూచువల్ ఫండ్​ వాళ్లు.. దీనికి సిస్టమేటిక్​ విత్​డ్రావల్ ప్లాన్​ను జత చేశారు.

సిస్టమాటిక్ విత్​డ్రావల్ ప్లాన్​ :మ్యూచువల్ ఫండ్ టెన్యూర్ పూర్తైన తరువాత మీరు ఒకేసారి లప్సమ్​ అమౌంట్​ను తీసుకోకుండా.. మ్యూచువల్​ ఫండ్​ డబ్బులను అలాగే ఉంచుతారు. అయితే మీ అవసరాలకు అనుగుణంగా నెలవారీగా నిర్దిష్ట మొత్తాన్ని విత్​డ్రా చేసుకుంటారు. దీనినే సిస్టమాటిక్ విత్​డ్రావల్ ప్లాన్ అంటారు. మిగిలిన డబ్బులను ఒక టార్గెట్ స్కీమ్​లో మరలా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ డబ్బుపై మరలా రాబడి వస్తుంది. అంటే మీ డబ్బులే.. మరలా మీకు డబ్బులను సృష్టిస్తూ ఉంటాయన్నమాట. దీనిని మరింత సులువుగా అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణ చూద్దాం.

Mutual Fund Source Plan And Target Plan : ఐసీఐసీఐ బ్యాంకు వెబ్ సైట్ ప్రకారం.. మీరు 8 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.10,000 పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ఈ టెన్యూర్ అయిన తరువాత, మీరు నెలవారీగా రూ.10,000 చొప్పున SWP చేసుకోవచ్చు. ఒక వేళ మీ సిప్​ టెన్యూర్​ను 10 ఏళ్ల వరకు పొడిగిస్తే.. మీ నెలవారీ SWP మొత్తం రూ. 15,000కు పెరుగుతుంది. ఇదే ఫార్ములాను 30 ఏళ్ల వరకు కొనసాగిస్తే మీకు ప్రతి నెలా రూ.1.20 లక్షలు వరకు అందుతుంది. వాస్తవానికి ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్​ పనిచేసింది. అందుకే కాల వ్యవధి పెరుగిన కొలదీ.. మీ ఆదాయం కూడా బాగా పెరుగుతూ వచ్చింది.

నోట్​ : ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన అంశం ఏమిటంటే.. SIP చేస్తున్నంత కాలం మీరు కట్టిన డబ్బులు సోర్స్​ ప్లాన్​లో ఉంటాయి. సిప్ టెన్యూర్ పూర్తి అయ్యి.. SWP ప్రారంభం అయిన తరువాత.. ఆ డబ్బులు మీరు కోరుకున్న టార్గెట్​ ప్లాన్​లో జమ అవుతాయి. అయితే సోర్స్​, టార్గెట్​ స్కీములు రెండూ ఒక్కటే అయ్యుండడానికి వీలుపడదు.

RBI MPC Meeting Updates : వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం.. మీ EMIపై ప్రభావం ఎంతంటే?

SBI Mobile Handheld Device Service : ఎస్​బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్​.. చిన్న రిక్వెస్ట్​తో​.. ఇంటి వద్దకే బ్యాంకింగ్​ సేవలు..

ABOUT THE AUTHOR

...view details