What Happens If You Cannot Repay Home Loan: సొంత ఇల్లు చాలా మందికి స్వప్నం. కానీ.. తగినంత ఆర్థిక స్థోమతలేని వారు బ్యాంకు రుణాలపై ఆధారపడతారు. ప్రస్తుతం మార్కెట్లో హౌసింగ్ లోన్ అనేది చాలా సులువుగానే అందుబాటులో ఉంది. 15 నుంచి 30 ఏళ్ల కాలవ్యవధికి వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు బ్యాంకులు వెసులుబాటు కల్పిస్తున్నాయి.
అయితే.. వాయిదాల పద్ధితిలో చెల్లింపులు అనేది వినటానికి సులువుగానే ఉన్నా, సంవత్సరాల తరబడి చెల్లించే క్రమంలో ఇబ్బందులు కూడా ఉంటాయి. ఎందుకంటే.. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. అలాంటి సందర్భాల్లో కొంత మంది సకాలంలో లోన్ చెల్లింపులు చేయలేరు. మరి, అప్పుడు ఏమవుతుంది? బ్యాంకులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
How To Renegotiate Home Loan EMIs Rise : గృహరుణ వ్యవధిని పెంచుకోవాలా..? ఇలా చేయండి!
ఒక నెల కట్టకపోతే? : హోమ్ లోన్ తీసుకున్న వారు ఒక నెల EMI కట్టలేకపోతే.. అప్పుడు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు వారికి SMS, ఈ-మెయిల్, మొబైల్ కాల్స్ ద్వారా రిమైండర్స్ పంపుతాయి. ఇది మాత్రమే కాకుండా కొన్ని అదనపు ఛార్జీలను కూడా వేస్తాయి. చెక్ బౌన్స్ ఛార్జీలు సైతం విధించే అవకాశం ఉంది. లోన్ ఈఎంఐ కట్టకపోతే బ్యాంకులు ఔట్‌స్టాండింగ్ లోన్ అమౌంట్‌పై 1 నుంచి 2 శాతం పెనాల్టీ విధిస్తాయి. దీన్ని EMI వాయిదాతోపాటు చెల్లించాల్సి ఉంటుంది.
రెండో నెల చెల్లించకపోతే? :వరుసగారెండో నెల కూడా ఈఎంఐ కట్టలేని పరిస్థితి వస్తే.. అప్పుడు బ్యాంక్ నుంచి వార్నింగ్ వస్తుంది. లోన్ ఈఎంఐ అమౌంట్, పెనాల్టీ చార్జీలను వెంటనే చెల్లించాలంటూ బ్యాంకులు రుణ గ్రహీతలకు నోటీసులు పంపుతారు. ఒక నెల ఈఎంఐ కట్టకపోతే బ్యాంకులు సాధారణంగానే చూస్తాయి. రెండో నెల ఈఎంఐ కట్టకపోతే బ్యాంకులు అలర్ట్ అవుతాయి. రెండు ఈఎంఐ డబ్బులను వెంటనే చెల్లించాలని కోరతాయి.