Follow These Rules Before Investing in Stock Markets: చాలా మందికి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని ఉంటుంది. అయితే ఎక్కువ మొత్తంలో జనాలు ఎంచుకునేది స్టాక్ మార్కెట్. తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టి.. ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు. అయితే అది అందరికీ సాధ్యం కాదు. మరి అలాంటి వారు ఏమి చేయాలి..? స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు సంపాదించాలంటే కొన్ని రూల్స్ ఫాలో కావాలి. అవి ఏంటంటే..?
What are the Rules Before Investing in Stock Markets: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి చాలా డబ్బు సంపాదించొచ్చు. ఇది నిజమే. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. షేర్ మార్కెట్‌లో సంపాదించాలని భావిస్తే ముందుగా కొన్ని బేసిక్ రూల్స్ తెలుసుకోవాలి. ఇందులో మొదటిది మీకు రిస్క్ తీసుకునే ధైర్యం ఉండాలి. ఈక్విటీ మార్కెట్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వేగంగానే నష్టాలు రావొచ్చు. రాంగ్ స్టాక్‌ను ఎంచుకుంటే పెట్టిన డబ్బు పోగొట్టుకోకతప్పదు.
స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే సమయంలో పలు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ప్రమోటర్ హానెస్టీ, మూలధనాన్ని తెలివిగా కేటాయించే కంపెనీ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకోవాలి. మీ దగ్గర ఉన్న మొత్తాన్ని స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు ప్రమోటర్ నిజాయితీని చూడాలి. నిధుల దుర్వినియోగానికి పాల్పడకుండా, నిజాయితీ కలిగిన ప్రమోటర్స్‌ను చూడాలి.
అలాగే, ప్రమోటర్ తెలివిగా కేటాయించే సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి. గత దశాబ్ద కాలంలో లేదా అంతకుమించిన సమయంలో ప్రమోటర్ మూలధనాన్ని తెలివిగా కేటాయిస్తున్నాడా లేదా చూడాలి. మూడో విషయం ఏమంటే మార్కెట్లో ప్రాబల్యం కలిగిన వాటిని చూడాలి. ఇన్వెస్టర్ ఎవరు కూడా సాధ్యమైనంత వరకు విడిచిపెట్టని వాటిని ఎంచుకునే ప్రయత్నం చేయాలి. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం అంత సులభం కాదు. క్రమశిక్షణ, సహనం కావాలి.