తెలంగాణ

telangana

ETV Bharat / business

Welfare Measures For LIC Agents And Employees : ఎల్​ఐసీ ఏజెంట్లకు, ఉద్యోగులకు గుడ్ ​న్యూస్​.. గ్రాట్యుటీ, టర్మ్​ ఇన్సూరెన్స్ కవరేజీ పెంపు.. 30% పెన్షన్​ కూడా.. - ఎల్​ఐసీ ఏజెెంట్ల కమిషన్ రెన్యూవల్ రూల్స్

Welfare Measures For LIC Agents And Employees In Telugu : ఎల్​ఐసీ ఉద్యోగులకు, ఏజెంట్లకు గుడ్​ న్యూస్​. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఎల్​ఐసీ ఏజెంట్లు, ఉద్యోగుల కోసం పలు సంక్షేమ చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా గ్రాట్యుటీ, టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీలను పెంచింది. పూర్తి వివరాలు మీ కోసం..

LIC Agents And Employees Welfare Measures
Welfare Measures For LIC Agents And Employees

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2023, 4:23 PM IST

Welfare Measures For LIC Agents And Employees : కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ.. లైఫ్​ ఇన్సూరెన్స్ కార్పొరేషన్​ ఆఫ్ ఇండియా (ఎల్​ఐసీ) ఉద్యోగులకు, ఏజెంట్లకు తీపి కబురు చెప్పింది. వీరి సంక్షేమం కోసం పలు సంక్షేమ చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎల్​ఐసీ ఏజెంట్ల గ్రాట్యుటీని పెంచింది. అలానే టర్మ్​ ఇన్సూరెన్స్ కవరేజీని పెంచింది. రెన్యువల్ కమిషన్​కు ఎలిజిబిలిటీ కల్పించింది. మరోవైపు ఎల్​ఐసీ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం.. ఫ్యామిలీ పెన్సన్​ను 30 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఎల్​ఐసీ ఏజెంట్స్​ గ్రాట్యుటీ పెంపు!
LIC Agent Gratuity : కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ.. ఎల్​ఐసీ ఏజెంట్ల గ్రాట్యుటీ లిమిట్​ను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. దీని ద్వారా ఏజెంట్ల పని పరిస్థితులు మెరుగవుతాయని పేర్కొంది.

టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ పెరిగింది!
LIC Agent Term Insurance Coverage : ఇప్పటి వరకు ఎల్​ఐసీ ఏజెంట్లకు టర్మ్​ ఇన్సూరెన్స్ కవర్​ అనేది కేవలం రూ.3,000 నుంచి రూ.10,000 రేంజ్​లో మాత్రమే ఉండేది. అయితే తాజాగా దీనిని రూ.25,000 నుంచి రూ.1,50,000 రేంజ్​లోకి మారుస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. ఒక వేళ ఎవరైనా ఏజెంట్​ దురదృష్టవశాత్తు మరణిస్తే, అతని/ఆమె కుటుంబానికి ఆర్థిక చేయూత లభిస్తుందని పేర్కొంది.

రెన్యువల్ కమిషన్​ ఎలిజిబిలిటీ
LIC Agent Renewal Commission Rules : ఇప్పటి వరకు పాత ఎల్​ఐసీ ఏజెంట్లు తమ కమిషన్​ను రెన్యువల్ చేసుకోవడానికి వీలులేకుండా ఉంది. కానీ ఆర్థిక మంత్రిత్వశాఖ తాజా నిర్ణయంతో.. మళ్లీ ఎల్​ఐసీ ఏజెంట్లుగా నియామకం పొందినవారు.. పాత కమిషన్​ను రెన్యువల్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ పొందుతారు. దీని వల్ల ఎల్​ఐసీ ఏజెంట్లకు ఆర్థిక లబ్ధి, ఆర్థిక స్థిరత్వం లభించనుంది.

ఫ్యామిలీ పెన్షన్​
LIC Employees Family Pension Rules : కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ.. ఎల్​ఐసీ ఉద్యోగులకు కూడా మంచి శుభవార్త చెప్పింది. ప్రధానంగా ఎల్​ఐసీ ఉద్యోగుల కుటుంబ సంక్షేమం కోసం 30 శాతం మేర ఫ్యామిలీ పింఛన్​ను పెంచుతూ​ నిర్ణయం తీసుకుంది.

14 లక్షల మందికి ప్రయోజనం!
ఆర్థిక మంత్రిత్వశాఖ తాజా నిర్ణయంతో.. దేశవ్యాప్తంగా ఉన్న 13 లక్షల ఎల్​ఐసీ ఏజెంట్లకు, ఒక లక్షకు పైగా ఉన్న ఎల్​ఐసీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

ఎల్​ఐసీ విస్తరణలో కీలక పాత్ర వారిదే!
ఈనాడు దేశంలో ఏదైనా బీమా సంస్థను ప్రజలు బలంగా నమ్ముతారంటే.. అది కచ్చితంగా ఎల్​ఐసీ మాత్రమే. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ. అయితే ఇది ఇంత విస్తృతంగా వ్యాపించడానికి కారణం మాత్రం కచ్చితంగా ఎల్​ఐసీ ఏజెంట్లు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అందుకే వారి సంక్షేమం కోసం తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ సంక్షేమ చర్యలను చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details