తెలంగాణ

telangana

ETV Bharat / business

బెస్ట్ ఇయర్లీ ప్లాన్​ కావాలా? Vi అందిస్తున్న టాప్​-5 రీఛార్జ్ ప్లాన్స్​పై ఓ లుక్కేయండి! - Vodafone Idea 3099 Plan benefits

Vodafone Idea Yearly Recharge Plans 2024 In Telugu : వోడాఫోన్ ఐడియా తమ కస్టమర్ల కోసం 5 ఇయర్లీ రీఛార్జ్ ప్లాన్​లను అందిస్తోంది. వాయిస్​ కాలింగ్, ఎస్ఎంఎస్​, డేటా బెనిఫిట్స్​తో పాటు, ఓటీటీ లవర్స్ కోసం పలు ఓటీటీ సబ్​స్క్రిప్షన్లను ఉచితంగా అందిస్తోంది. వాటి పూర్తి వివరాలు మీ కోసం.

Vi prepaid plans 2024
Vodafone Idea Yearly Recharge plans 2024

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 1:55 PM IST

Updated : Jan 15, 2024, 4:09 PM IST

Vodafone Idea Yearly Recharge Plans 2024 : భారత్​లో మూడో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన వొడాఫోన్ ఐడియా తమ కస్టమర్ల కోసం బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తోంది. వీటిలో ఇయర్లీ ప్లాన్స్ 5 ఉన్నాయి. ఈ ప్లాన్​ల ఖరీదు కాస్త ఎక్కువయినప్పటికీ, అందుకు తగ్గ మంచి బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి. వినియోగదారులకు కేవలం మెుబైల్ ఇంటర్నెట్ సేవలే కాకుండా, ఇతరత్రా ఎంటర్​టైన్​మెంట్ సబ్​స్క్రిప్షన్స్​లను కూడా అందిస్తోంది. ఈ రీఛార్జ్​ ప్లాన్​ల్లో రూ.1799 ప్లాన్ అన్నంటికంటే కాస్త చీప్​గా వస్తోంది. రూ.3199 ప్లాన్ అన్నింటికంటే ఖరీదైనది. ఈ ఐదు ప్లాన్​ల రీఛార్జ్​ వ్యాలిడిటీ ఏడాది పాటు ఉంటుంది. వీటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Vodafone Idea 1799 Plan
ఈ ప్లాన్​ను రీఛార్జ్ చేసుకుంటే ఏడాదిపాటు అన్​లిమిటెడ్ కాల్స్​తో పాటు, 24జీబీ డేటా, ప్రతిరోజు 100 SMSలు లభిస్తాయి. వీటితో పాటు వీఐ మూవీస్ & టీవీ యాప్స్​ను కూడా ఉచితంగా వాడుకోవచ్చు.

Vodafone Idea 2899 Plan
ఈ ప్లాన్​ను రీఛార్జ్ చేస్తే ఏడాది పాటు అన్​లిమిటెడ్ కాల్స్, ప్రతిరోజు 1.5 జీబీ డేటా, రోజు 100 SMSలు చొప్పున లభిస్తాయి. వీటికి అదనంగా వీఐ టీవీ, వీఐ మూవీస్, వీఐ హీరో అన్​లిమిటెడ్ బెనిఫిట్స్ కూడా అందుతాయి. ముఖ్యంగా వీఐ హీరో అన్​లిమిటెడ్​లో భాగంగా వీకెండ్ డేటా రోల్​ఓవర్​, డేటా డిలైట్స్, బింజ్ ఆల్ నైట్ బెనిఫిట్స్ దొరుకుతాయి.

  • డేటా రోల్​ఓవర్​ అంటే, మీరు ఈ నెలలో ఉపయోగించాల్సిన డేటాలో కొంత మిగిలిపోతే, దానిని వచ్చే నెలలో కూడా వాడుకోవచ్చు.
  • డేటా డిలైట్ అంటే, ప్రతి నెలా అదనపు ఖర్చు లేకుండా 2జీబీ వరకు డేటా బ్యాకప్ లభిస్తుంది.
  • బింజ్​ ఆల్​ నైట్ అంటే, మీరు రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు, ఎలాంటి అదనపు డబ్బులు చెల్లించకుండా, అన్​లిమిటెడ్ ఇంటర్నెట్ వాడుకోవచ్చు.

Vodafone Idea 2999 Plan
ఈ ప్లాన్​ను రీఛార్చ్ చేసుకుంటే 850 జీబీ డేటా ఒకేసారి వస్తుంది. దానితోపాటు ఏడాదంతా అన్​లిమిటెడ్ కాల్స్, రోజూ 100 SMSలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్ ద్వారా కేవలం వీఐ మూవీస్​, టీవీ యాప్​లు మాత్రమే అదనంగా లభిస్తాయి.

Vodafone Idea 3099 Plan
ఈ ప్లాన్​ను తీసుకుంటే, ప్రతిరోజు 2జీబీ డేటాతోపాటు, 100 SMSలు, అన్​లిమిటెడ్ వాయిస్​ కాల్స్ చేసుకోవచ్చు. వీటితో పాటు వీఐ మూవీస్ & టీవీ, డిస్నీ+హాట్​స్టార్, బింజ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్​ఓవర్, డేటా డిలైట్స్ లాంటి బెనిఫిట్స్ లభిస్తాయి. ప్రస్తుతం ఈ ప్లాన్​ను వీఐ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే, రూ.75 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

Vodafone Idea 3199 Plan
ఈ ప్లాన్​ను రీఛార్జ్ చేసుకుంటే, ప్రతిరోజు 2జీబీ డేటాతోపాటు, అన్​లిమిటెడ్ కాల్స్​, 100 SMSలు చేయవచ్చు. అదనంగా వీఐ టీవీ & మూవీస్, బింజ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్​ఓవర్​, డేటా డిలైట్స్ లభిస్తాయి. ఒక సంవత్సర కాలవ్యవధితో అమెజాన్ ప్రైమ్ సబ్​స్క్రిప్షన్​ ఉచితంగా లభిస్తుంది.

కారు ఇన్సూరెన్స్ డీలర్ దగ్గరే​ తీసుకోవాలా? వేరే బెటర్​ ఆప్షన్స్​ ఉన్నాయా?

మీరు ఉద్యోగులా? మీ జీతంపై కట్టాల్సిన ఆదాయ పన్నును సింపుల్​గా లెక్కించండిలా!

Last Updated : Jan 15, 2024, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details