తెలంగాణ

telangana

ETV Bharat / business

ICICI బ్యాంక్​ కేసులో వీడియోకాన్​ ఛైర్మన్​ అరెస్ట్​ - వీడియోకాన్​ మాజీ సీఈఓ చందా కొచ్చర్ కేసు

ఐసీఐసీఐ బ్యాంక్​ రుణ మోసం కేసులో వీడియోకాన్​ వ్యవస్థాపకుడు వేణుగోపాల్​ దూత్​​ను సీబీఐ అరెస్ట్​ చేసింది.

videocon founder Dhoot arrested
వీడియోకాన్​ ఛైర్మన్

By

Published : Dec 26, 2022, 12:28 PM IST

Updated : Dec 26, 2022, 1:04 PM IST

వీడియోకాన్​ వ్యవస్థాపకుడు వేణుగోపాల్​ దూత్​ను సీబీఐ అరెస్ట్​ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్​ రుణ మోసం కేసులో సోమవారం ఉదయం ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలిపింది. ఇదే కేసులో ఐసీఐసీఐ బ్యాంక్​ మాజీ సీఈఓ, ఎండీ చందా కొచ్చర్​, ఆమె భర్త దీపక్​ కొచ్చర్​ను మూడు రోజులు క్రితం అదుపులోకి తీసుకుంది సీబీఐ.

వీడియోకాన్‌ గ్రూపునకు రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడినట్లు నమోదైన కేసులో విచారణ జరిపిన సీబీఐ.. 71 ఏళ్ల దూత్​తో పాటు కొచ్చర్​ దంపతులను అరెస్ట్​ చేసింది. వీడియోకాన్ గ్రూపునకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈఓగా 2018లో చందా కొచ్చర్‌ వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2012లో బ్యాంకు సీఈవో హోదాలో రూ. 3,250 కోట్ల రుణం మంజూరు చేయగా.. అది ఎన్‌పీఏగా మారింది. తద్వారా కొచ్చర్​ కుటుంబం లబ్ధి పొందినట్లు సీబీఐ ఆరోపించింది. వేణుగోపాల్​ దూత్​ స్థాపించిన నూపవర్ రెన్యూవబుల్స్ కంపెనీలో దీపక్​ కొచ్చర్​ పెట్టుబుడులు పెట్టారని సీబీఐ ఆరోపించింది.

Last Updated : Dec 26, 2022, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details