UPI Vs UPI Lite : డిజిటల్ ఇండియా కల సాకారం అయ్యే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నేడు ప్రతి ఒక్కరూ యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), యూపీఐ లైట్లను ఉపయోగించి సులువుగా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు.
- యూపీఐ అనేది ఒక సమగ్రమైన వేదిక అని చెప్పవచ్చు. ముఖ్యంగా వివిధ బ్యాంక్ అకౌంట్లను లింక్ చేసుకుని.. యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. అలాగే ఎలాంటి అడ్డంకులు లేకుండా సులువుగా డిజిటల్ పేమెంట్స్ చేయవచ్చు. అలాగే ఎన్నో బ్యాంకింగ్ సర్వీసులను కూడా పొందవచ్చు.
- యూపీఐ లైట్ అనేది ఒక సింప్లిఫైడ్ వెర్షన్. దీనిని బేసిక్ ఫోన్లో కూడా ఉపయోగించుకోవచ్చు. కాల్ లేదా టెక్ట్స్ చేసి యూపీఐ పేమెంట్స్ చేయడానికి కూడా ఇది వీలు కల్పిస్తుంది.
యూపీఐ అంటే ఏమిటి?
What is UPI :యూపీఐ అనేది 24x7 పనిచేసే పేమెంట్ సిస్టమ్. దీనిని ఉపయోగించి రియల్ టైమ్‌లో మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
యూపీఐ లైట్ అంటే ఏమిటి?
What is UPI Lite :యూపీఐ లైట్ అనేది ఒక ఆన్-డివైజ్ వాలెట్ ఫీచర్. దీనిని ఉపయోగించి రియల్ టైమ్‌లో.. చిన్న మొత్తాల్లో మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
యూపీఐ లైట్ Vs యూపీఐ
Difference Between UPI Lite and UPI :యూపీఐ, యూపీఐ లైట్ మధ్య కొన్ని కచ్చితమైన భేదాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- యూపీఐ లైట్ ద్వారా చిన్న మొత్తాల్లో ఫండ్ ట్రాన్స్ఫర్, పేమెంట్స్ చేసుకోవచ్చు. అయితే దీనిలో కొన్ని అధునాతన ఫీచర్లు ఉండవు. అయితే ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాల్లో కూడా దీని ద్వారా సులువుగా పేమెంట్స్ చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే బేసిక్ ఫోన్‌తో కూడా ఆర్థిక లావాదేవీలు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
- యూపీఐ అనేది ఒక సమగ్రమైన ప్లాట్ఫారం. దీనిలో పేమెంట్స్, ఫండ్ ట్రాన్స్ఫర్ సహా అన్ని బ్యాంకింగ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
అన్ని యాప్‌ల్లోనూ ఇవి పనిచేస్తాయా?
- ఎన్పీసీఐలో సభ్యత్వం ఉన్న అన్ని బ్యాంకులు కూడా యూపీఐ ఫెసిలిటీని అందిస్తున్నాయి. అలాగే BHIM, గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే లాంటి TPAP అప్లికేషన్లు కూడా యూపీఐ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
- BHIM, పేటీఎం, సహా కొన్ని యాప్‌ల్లో.. యూపీఐ లైట్ ఫీచర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి 8 బ్యాంకులు మాత్రమే తమ కస్టమర్లకు యూపీఐ లైట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
ట్రాన్సాక్షన్స్ ఎలా చెక్ చేసుకోవాలి?
- యూపీఐ లైట్ కస్టమర్లు ఒక రోజులో చేసిన ట్రాన్సాక్షన్స్ వివరాలు అన్నీ SMS ద్వారా తెలుసుకోగలుగుతారు.
- యూపీఐ కస్టమర్లు తమ ఆర్థిక లావాదేవీలను .. యూపీఐ మొబైల్ అప్లికేషన్‌లోని ట్రాన్సాక్షన్ హిస్టరీలో చూసుకోవచ్చు.
ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంత?
UPI vs UPI Lite Transaction Limit :
- యూపీఐ ద్వారా ఒక రోజులో గరిష్ఠంగా రూ.2 లక్షలు వరకు పంపించవచ్చు. అలాగే ఒక రోజులో (24 గంటల్లో) 20 ట్రాన్సాక్షన్స్ వరకు చేసుకోవచ్చు.
- యూపీఐ లైట్ యూజర్లు ఒక రోజులో గరిష్ఠంగా రూ.4,000 వరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఒక రోజులో ఎన్నైనా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అయితే ఒకసారికి గరిష్ఠంగా రూ.500 వరకు మాత్రమే పంపించడానికి వీలు అవుతుంది.
యూపీఐ పిన్
- యూపీఐ పేమెంట్స్ చేయాలంటే.. 4 లేదా 6 అంకెల పిన్ను కచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- యూపీఐ లైట్ ద్వారా చేసే పేమెంట్స్‌కు ఎలాంటి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు.
నోట్ : వాస్తవానికి యూపీఐతో డబ్బులను స్వీకరించవచ్చు. అయితే యూపీఐ లైట్‌తో.. మీ వాలెట్ నుంచి కేవలం డబ్బులు పంపించడానికి మాత్రమే వీలు అవుతుంది.