UPI tops On Digital Payments: రిటైల్ ఆన్‌లైన్ లావాదేవీల ప్లాట్‌ఫామ్ యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) దేశంలో జరుగుతున్న డిజిటల్ చెల్లింపుల్లో ఆధిపత్యం కొనసాగిస్తోందని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వెల్లడించింది. బై నౌ పే లేటర్ (బీఎన్‌పీఎల్), సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) లావాదేవీలు కూడా వచ్చే 5 ఏళ్లలో డిజిటల్ చెల్లింపుల్లో గణనీయ వృద్ధికి కీలకంగా మారనున్నాయని అందులో పేర్కొంది. భారత డిజిటల్ చెల్లింపుల విపణి 23 శాతం (పరిమాణ పరంగా) స్థిర వార్షిక సంచిత వృద్ధి రేటును (సీఏజీఆర్) నమోదు చేస్తోందని తెలిపింది. 2025-26 నాటికి రూ.21,700 కోట్ల లావాదేవీలు డిజిటల్‌గానే జరుగుతాయని అభిప్రాయపడింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ లావాదేవీలు రూ.5,900 కోట్లుగా నమోదయ్యాయని 'ది ఇండియన్ పేమెంట్స్ హ్యాండ్‌బుక్-2021-26' పేరుతో రూపొందించిన నివేదికలో పీడబ్ల్యూసీ ఇండియా వివరించింది. 2020-21లో యూపీఐ లావాదేవీలు 2,200 కోట్లకు చేరాయి. 2025-26 నాటికి ఇవి 16,900 కోట్లకు చేరే అవకాశం ఉంది. అంటే 122 శాతం సంచిత వార్షిక వృద్ధి రేటు నమోదు చేయనున్నాయి.
డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ టాప్.. ఐదేళ్లలో మరింత వృద్ధి - యూపీఐ న్యూస్
UPI tops On Digital Payments: దేశంలో జరుగుతున్న డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) లావాదేవీలే అధికంగా జరుగుతున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరుగుతాయని తెలిపింది.
UPI tops On Digital Payments