తెలంగాణ

telangana

ETV Bharat / business

యూపీఐతో క్రెడిట్​ కార్డును లింక్ చేయాలనుకుంటున్నారా? లాభాలతో పాటు ఈ నష్టాలు కూడా

UPI Link With Credit Card : ప్రజల ఆర్థిక లావాదేవీల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్​ఫేస్ (యూపీఐ) విప్లవాత్మక మార్పు తెచ్చింది. యూపీఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు సులభంగా చెల్లింపులు చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. యూపీఐతో క్రెడిట్​ కార్డులను అనుసంధానం చేయడానికి ఆర్​బీఐ అనుమతించింది. అయితే దీనివల్ల లాభాలేంటి? నష్టాలేంటి? ఏవిధంగా ఉపయోగించడం మంచిది? నిపుణులు ఏమంటున్నారు అనే విషయాలు మీ కోసం.

UPI Link With Credit Card
UPI Link With Credit Card

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2023, 9:11 AM IST

UPI Link With Credit Card :యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్​ ఇంటర్​ఫేస్​) భారతీయుల జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. డిజిటల్ చెల్లింపులు, నగదు బదిలీలను అతి సులభంగా ఎక్కడినుంచైనా చేసే సౌలభ్యాన్ని యూపీఐ కల్పించింది. యూపీఐతో క్రెడిట్​కార్డ్​ను లింక్ చేసుకునే అవకాశాన్ని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా కల్పించింది. అయితే దీనివల్ల ఎటువంటి ప్రభావాలుంటాయి? లాభాలేంటి? నష్టాలేంటి? దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

ఎక్కడినుంచైనా చెల్లించే అవకాశం
యూపీఐతో క్రెడిట్ కార్డును లింక్ చేయడం వల్ల మీరు రోజులో ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. యూపీఐ వివిధ రకాల చెల్లింపులు చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తుంది. వ్యాపారులకు చెల్లింపులు, కరెంట్​బిల్లులు, గ్యాస్​ మొదలైన బిల్లులను చెల్లించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. యూపీఐతో క్రెడిట్ కార్డును లింక్ చేయడం వల్ల మీరు ఈ సేవలను పొందవచ్చు.

లావాదేవీలు సులభంగా చేసుకోవచ్చు
యూపీఐని క్రెడిట్​కార్డుతో లింక్ చేయడం వల్ల ఆన్​లైన్ చెల్లింపులను సులభంగా చేయవచ్చని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. గతంలో యూపీఐ చెల్లింపులు డెబిట్​ కార్డు ద్వారా మాత్రమే యాక్సెస్ చేసే సౌలభ్యం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మీరు యూపీఐతో లింక్​చేసిన క్రెడిట్​ కార్డు ద్వారా మీకున్న పరిమితి వరకు లావాదేవీలు చేసుకోవచ్చు. ఆర్​బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఫలితంగా క్రెడిట్​ కార్డుల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఖర్చులు పెరిగే అవకాశం
యూపీఐతో క్రెడిట్​కార్డులను లింక్ చేయడం వల్ల ఎన్ని లాభాలున్నాయో, సరిగా వినియోగించకపోతే కొన్ని ఇబ్బందులున్నాయంటున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు. ముఖ్యంగా ఖర్చులు పెరిగిపోయే అవకాశాలున్నాయి. అతి సులభంగా పేమెంట్ చేసుకునే సౌలభ్యం వల్ల అధికమొత్తంలో వ్యయం చేసే ప్రమాదం ఉంది. అందువల్ల క్రెడిట్​కార్డును వాడేవారు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.

ఆర్థిక క్రమశిక్షణ అవసరం
సేవింగ్ అకౌంట్​తో యూపీఐ లింక్ చేసినప్పటికీ మనం అధిక ఖర్చులను నియంత్రించవచ్చు. ఎప్పటికప్పుడు మనం అకౌంట్​ బ్యాలెన్స్​ తెలుసుకొనే సదుపాయం ఉంటుంది. మన ఈ-పాస్​బుక్​ ద్వారా కూడా ఎంత వ్యయం చేస్తున్నామనే వివరాలు తెలుసుకోవచ్చు. డబ్బులు ఉన్నంత వరకే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కానీ, క్రెడిట్ కార్డు విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. లేదంటే చూసిన వస్తువులన్నీ కొనుగోలు చేసే ప్రమాదం ఉంది. అందువల్ల క్రెడిట్​కార్డును యూపీఐకి లింక్ చేసే విషయంలో అప్రమత్తత అవసరం.

పరిమితి విధించడం అవసరం
క్రెడిట్​కార్డ్​లు అధిక లిమిట్ ఇవ్వడం వల్ల.. వినియోగదారులు ఖర్చు పెట్టే విషయంలో నియంత్రణ కోల్పోతారు. అందువల్ల సాధారణ లావాదేవీల కోసం క్రెడిట్​కార్డ్ వినియోగదారులు బడ్జెట్​ రూపొందించుకోవడం చాలా అవసరం. అంతవరకే ఖర్చు చేయడం ముఖ్యం. ఒకవేళ మీ వద్ద ఎక్కువ కార్డులు ఉన్నట్లయితే కిరాణా, యుటిలిటీ బిల్లులు (కరెంటు బిల్లులు, గ్యాస్​ బిల్లు) లాంటి చిన్న పేమెంట్స్ చేయడానికి వాడితే ఉత్తమం. మీ క్రెడిట్​ బ్యాలెన్స్​ను క్రమం తప్పకుండా చెక్​ చేయడం మర్చిపోవద్దు.

ఆధార్​ కార్డుతో యూపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చు! ఇకపై ఏటీఎం కార్డు అవసరం లేదు!!

How To Reverse UPI Transaction : యూపీఐ ద్వారా రాంగ్​ నంబర్​కు పేమెంట్​ చేశారా?.. వెనక్కు తీసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details