UPI ATM Cash Withdrawal Process : భారతదేశం టెక్నాలజీ రంగంలో దూసుకుపోతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో సాంకేతికత చాలా విస్తృతంగా విస్తరిస్తోంది. అందులో భాగంగా నేడు భారత్‌లో 'యూపీఐ ఏటీఎం' సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా మీ వద్ద డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేకున్నా.. చాలా సులువుగా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
జస్ట్ మొబైల్ ఉంటే చాలు!
UPI Cash Withdrawal With Mobile : యూపీఐ ఏటీఎం ఫక్షనాలిటీ ఉపయోగించి.. ఏ ఏటీఎం నుంచి అయినా సులువుగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే మీ దగ్గర కచ్చితంగా మొబైల్ ఫోన్ ఉండాల్సి ఉంటుంది.
యూపీఐ ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయడం ఎలా?
How to withdraw cash from UPI ATM :యూపీఐ ఏటీఎం ద్వారా డబ్బులు విత్‌డ్రా చేయడం చాలా సులువు. ఇందుకోసం మీరు చేయాల్సినది ఏమిటంటే..
- ముందుగా మీరు ఏటీఎంకు వెళ్లి, UPI Cash Withdrawal ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి.
- వెంటనే మీకు Withdrawal Amount ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఎంత మొత్తం డబ్బులు తీయాలనుకుంటున్నారో.. ఆ అమౌంట్‌ను ఎంటర్ చేయాలి. తరువాత..
- ఏటీఎం స్క్రీన్‌పై ఒకసారి మాత్రమే ఉపయోగించే QR Code కనిపిస్తుంది.
- మీరు మీ ఫోన్లో ఉన్న ఏదైనా యూపీఐ యాప్ ఓపెన్ చేసి, ఈ QR Codeని స్కాన్ చేయాలి. తరువాత మొబైల్లోని యూపీఐ యాప్‌లో.. యూపీఐ పిన్ ఉపయోగించి, ఆ ట్రాన్సాక్షన్‌ను ఆథరైజ్ చేయాలి.
- ట్రాన్సాక్షన్ ఆథరైజేషన్ జరగగానే.. ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా అవుతాయి. ఇంతే.. సింపుల్!
యూపీఐ ఏటీఎం ద్వారా క్యాష్ విత్‌డ్రా! యూపీఐ ఏటీఎం కీ ఫీచర్స్
UPI ATM Features :
- Interoperable - అంటే కేవలం మీ ఫోన్లోని యూపీఐ యాప్ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
- కార్డ్ లెస్ ట్రాన్సాక్షన్ - అంటే మీ వద్ద ఎలాంటి క్రెడిట్, డెబిక్ కార్డ్ లేకున్నా కూడా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు.
- యూపీఐ ఏటీఎం ద్వారా చేసే ఒక్కో లావాదేవీపై రూ.10,000 పరిమితి ఉంటుంది. అంటే మీరు ఒకసారికి గరిష్ఠంగా రూ.10,000 వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోగలుగుతారు.
- మరీ ముఖ్యంగా యూపీఐ యాప్ ఉపయోగించి.. వివిధ బ్యాంకు ఖాతాలలోని నగదును ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు.
యూపీఐ ఏటీఎం సృష్టించింది ఎవరు?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) .. ఈ యూనిక్ యూపీఐ ఏటీఎం ఫక్షనాలిటీని అభివృద్ధి చేసింది.
వాయిస్ ఎనేబుల్డ్ యూపీఐ పేమెంట్స్
Voice Enabled UPI Payments :ఎన్పీసీఐ తాజాగా యూపీఐ, UPI LITE X, ట్యాప్ అండ్ పే, హలో! యూపీఐ లాంటి ప్రొడక్టులను లాంఛ్ చేసింది. వీటిల్లోనూ సరికొత్త యూపీఐ-ఏటీఎం పక్షనాలిటీని ప్రారంభించింది. అలాగే యూపీఐద్వారా ఆర్థిక లావాదేవీలు పూర్తి అయిన వెంటనే.. వాయిస్ ద్వారా ఆ సమాచారం అందేలా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో యూపీఐ ఏటీఎం వినియోగం గురించి ఓ ఇన్‌ప్లూయెన్సర్ చేసిన వీడియోను.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లో పోస్ట్ చేశారు.
స్పందన అద్భుతం!
UPI Transactions Crossed 10 Billion Mark In August :ఇండియాలో యూపీఐ పేమెంట్స్ ప్రారంభించిన తరువాత అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేవలం ఒక్క ఆగస్టు నెలలోనే దేశవ్యాప్తంగా 10 బిలియన్ ( 1000 కోట్లు) యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. డిజిటల్ చెల్లింపుల యుగంలో దీనిని ఒక మైలురాయిగా చెప్పవచ్చు.