Upcoming Tata EV Cars : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. రానున్న ఒకటి, రెండేళ్లలో 5 ఎలక్ట్రిక్ కార్లను ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా హారియర్ ఈవీ, పంచ్ ఈవీ, సియెర్రా ఈవీ, సఫారీ ఈవీ, కర్వ్ ఈవీ కార్లను అందుబాటులోకి తెచ్చి.. తన ఈవీ పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరించుకోవాలని టాటా మోటార్స్ ప్రణాళిక వేస్తోంది. అందుకే వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Tata Punch EV Car Launch Date :టాటా మోటార్స్ బహుశా 2023 చివరిలోనే ఈ టాటా పంచ్ ఈవీ కారును లాంఛ్ చేసే అవకాశం ఉంది. చిన్న బడ్జెట్లో మంచి ఎలక్ట్రిక్ కారు కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ కారు మోడల్ పలుమార్లు ఇండియన్ రోడ్లపై కనిపించింది. ఈ కారు చాలా వరకు ICE పంచ్ డిజైన్లోనే ఉంది. అయితే జెన్-2 సిగ్మా ఆర్కిటెక్చర్‌తో, ఈవీ స్పెసిఫిక్ డిజైన్‌తో దీనిని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. టాటా పంచ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది.
Tata Punch EV Car Range :ఈ టాటా పంచ్ ఈవీలోని బ్యాటరీలను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. దాదాపు 300 కి.మీ - 350 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.
Tata Harrier EV Launch Date :2023 ఆటో ఎక్స్‌పోలో టాటా హారియర్ ఈవీని ప్రదర్శించారు. ఈ ఎలక్ట్రిక్ కారును బహుశా 2024లో లాంఛ్ చేసే అవకాశం ఉంది.
Tata Harrier EV Range :ఈ టాటా హారియర్ ఎలక్ట్రిక్ కారులో 60 కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుందని.. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ కారు డ్యూయెల్ మోటార్ ఏడబ్ల్యూడీ సెటప్‌తో వస్తుందని కూడా సమాచారం అందుతోంది.
Tata Safari EV Launch Date :టాటా మోటార్స్ కంపెనీ.. హారియర్ ఈవీతోపాటే, సఫారీ ఈవీని కూడా లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ టాటా సఫారీ కారు డిజైన్ దాదాపు ICE సఫారీలానే ఉంటుంది. హారియర్ ఈవీలో అమర్చిన పవర్ట్రైన్, ఏడబ్ల్యూడీ సిస్టమ్‌లనే.. టాటా సఫారీలో కూడా పొందుపరచారని సమాచారం.