తెలంగాణ

telangana

ETV Bharat / business

2024లో లాంఛ్ కానున్న టాప్-3 SUV కార్స్ ఇవే! ధర ఎంతంటే? - best upcoming 5 seater cars 2024

Upcoming SUV Cars Under 15 Lakh In Telugu : మీరు కొత్త ఎస్​యూవీ కారు కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.15 లక్షలు మాత్రమేనా? అయితే ఇది మీ కోసమే. త్వరలో టాటా, మహీంద్రా, హ్యుందాయ్​ కంపెనీలు తమ లేటెస్ట్ ఎస్​యూవీ కార్లను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం.

best SUV Cars Under 15 Lakh
Upcoming SUV Cars Under 15 Lakh

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 3:42 PM IST

Upcoming SUV Cars Under 15 Lakh :నేడు మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎస్‌యూవీ కార్లకు విపరీతంగా డిమాండ్‌ పెరుగుతోంది. అందుకే కార్ల తయారీ కంపెనీలు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా సరికొత్త ఎస్​యూవీలను రూపొందించి మార్కెట్లోకి తెస్తున్నాయి. ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ అనేది చాలా కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు అన్నీ తక్కువ బడ్జెట్లోనే మంచి ఫీచర్స్​, స్పెసిఫికేషన్లతో స్టైలిష్ కార్లను రూపొందించే పనిలో ఉన్నాయి. వాటిలో రూ.15 లక్షల బడ్జెట్లోని టాప్​-3 అప్​కమింగ్ ఎస్​యూవీ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Mahindra Thar Features :
మన దేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన కారు మహీంద్రా థార్. అందుకే మహీంద్రా కంపెనీ వచ్చే ఏడాది 5 డోర్లతో సరికొత్త థార్​ ఎస్​యూవీ కారును లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ థార్‌ 5-డోర్‌.. స్కార్పియో ఎన్‌ మోడల్‌కు దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే దీని డిజైన్‌ సరికొత్తగా ఉండనుంది. ఈ మహీంద్రా థార్​ SUV కారులో.. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, LED హెడ్‌ల్యాంప్‌, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లాంటి అధునాతన ఫీచర్లు పొందుపరిచినట్లు తెలుస్తోంది.

Mahindra Thar Price :వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న ఈ మహీంద్రా థార్‌ ధర దాదాపు రూ.15 లక్షలు ఉంటుందని అంచనా.

మహీంద్రా థార్​
మహీంద్రా థార్​
మహీంద్రా థార్​
మహీంద్రా థార్​
మహీంద్రా థార్​

Hyundai Creta Features :
మన దేశీయ మార్కెట్‌లో చాలా మంది వినియోగదారులను ఆకర్షిస్తున్న మోడల్స్​లో హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ ఒకటి. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే దీనిని మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 2020లో ప్రారంభించిన ఈ మోడల్​ను.. మరికొన్ని అప్‌డేట్‌లతో వచ్చే ఏడాది మార్కెట్లోకి తెస్తున్నారు. ADAS, 360 డిగ్రీ పార్కింగ్‌ కెమెరా లాంటి కొత్త ఫీచర్లను దీనిలో పొందుపరిచినట్లు సమాచారం.

Hyundai Creta Price :ఈ హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ ధర రూ.15 లక్షలకు అటుఇటుగా ఉండవచ్చు.

హ్యుందాయ్ క్రెటా
హ్యుందాయ్ క్రెటా
హ్యుందాయ్ క్రెటా
హ్యుందాయ్ క్రెటా
హ్యుందాయ్ క్రెటా

Tata Curvv Features :
టాటా కర్వ్‌ వచ్చే ఏడాది మన మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ ఎస్‌యూవీ కారు ఎలక్ట్రిక్​, ఐసీఈ వేరియంట్లలో తీసుకురానున్నారు. 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఈ టాటా కర్వ్‌ డిజైన్​.. నెక్సాన్‌ కారు డిజైన్‌లా కనిపిస్తోంది. ఈ ఎస్​యూవీ ఎలక్ట్రిక్​ కారు 400 కిలోమీటర్ల రేంజ్‌తో వస్తుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఎస్​యూవీ కారులో 1.5 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ అమర్చుతున్నారు. ఇది 170 bhp పవర్​, 280 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. అంతేకాదు 1.5 లీటర్‌ టర్బో డీజిల్‌ ఇంజన్‌ వేరియంట్​ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.

Tata Curvv Price :ఈ టాటా కర్వ్ ఎస్​యూవీ ధర రూ.15 లక్షల బడ్జెట్లోపు ఉంటుందని సమాచారం.

టాటా కర్వ్​
టాటా కర్వ్​
టాటా కర్వ్​
టాటా కర్వ్​
టాటా కర్వ్​

2024లో లాంఛ్​ కానున్న టాప్​-6 ఫ్యామిలీ కార్స్ ఇవే! ధర ఎంతంటే?

రూ.5,999కే ఇండిగో ఎయిర్​లైన్స్​ హాలీడే ప్యాకేజ్​ - ఫారిన్ టూర్స్​కు కూడా!

ABOUT THE AUTHOR

...view details