ఒకప్పుడు కార్లలో ఎస్యూవీ(స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్) వాహనాలకు అంతగా ఆదరణ లభించలేది కాదు. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా ఈ సెగ్మెంట్ వాహనాలకు క్రేజ్ పెరిగింది. ధర ఎక్కువైనా చాలా మంది ఎస్యూవీ వాహనల వైపు మొగ్గుచూపుతున్నారు. ఒక్కప్పుడు హ్యాచ్‌బ్యాక్‌లకు ఎక్కువ డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని ఎంట్రీ లెవెల్, మిడ్‌సైజ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు భర్తీ చేశాయి. ఈ సెగ్మెంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది కారు 'హ్యుందాయ్ క్రెటా'. ఈ కారుకు ప్రజల్లో మంచి ఆదరణ లభించింది. ప్రతి నెల సగటున 12,000 యూనిట్ల చొప్పున ఈ కార్లు అమ్ముడుపోతున్నాయి. దీంతో ఈ కారుకు పోటీగా మిగతా కంపెనీలు కూడా.. అదిరిపోయే ఫీచర్లతో కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. హ్యుందాయ్ క్రెటాకు పోటీగా.. త్వరలో భారత విపణిలోకి విడుదల కాబోయో కార్లు ఇవే..
1. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్
ఇప్పటికే రోడ్లపై పరుగులు పెడుతోంది కియా సెల్టోస్. ఈ కారు బేసిక్ ఫీచర్స్‌లో మార్పులు చేసి ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను విడుదల చేయనున్నారు. ఈ కారు 2023 మధ్యలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. రీడిజైన్ చేసిన ఎక్ట్సీరియర్‌తో పాటు అడాస్( అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్) ఫీచర్, సరికొత్త ఇంటీరియర్‌తో ఈ కారు రానుంది. కియా సెల్టోస్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఈ ఇంజిన్ 160 పీఎస్ వపర్, 253 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుందని సమాచారం.