Upcoming Hybrid Cars In India :ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఐసీఈ కార్స్ హవా నడుస్తూ వచ్చింది. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగం పెరుగుతోంది. అయితే ఈ రెండింటి మధ్యలో హైబ్రిడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇవి మంచి ఫ్యూయెల్ ఎఫీషియన్సీ, సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తాయి. అందుకే చాలా మంది కస్టమర్లు ఈ హైబ్రిడ్ కార్లు కొనేందుకు ఇష్టపడుతున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ లేటెస్ట్ హైబ్రిడ్ కార్లను మార్కెట్లోకి తెచ్చాయి. మరిన్ని సరికొత్త మోడళ్లను త్వరలో ఇండియన్ మార్కెట్లోకి తేవడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అందుకే వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
1. New Gen Renault Duster Features : ఈ రెనో డస్టర్ కారును 2025 ద్వితీయార్థంలో భారత్ మార్కెట్లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ థర్డ్ జనరేషన్ రెనో డస్టర్ కారు స్ట్రాంగ్ హైబ్రిడ్ 140 ఇంజిన్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది హైబ్రిడ్ సిస్టమ్ ఎలక్ట్రిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో పనిచేస్తుంది. ఈ రెనో కారు 1.6 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 94 bhp పవర్ జనరేట్ చేస్తుంది. దీనితోపాటు 49 bhp పవర్ జనరేట్ చేసే రెండు ఎలక్ట్రిక్ మోటార్స్ కూడా ఇందులో ఉంటాయి.
పట్టణాల్లో, నగరాల్లో ఈ రెనో డస్టర్ కారు 80 శాతం వరకు ఆల్-ఎలక్ట్రిక్ మోడ్‌లో పనిచేస్తుంది. కనుక చాలా వరకు ఇంధనం ఆదా అవుతుంది. ఈ డస్టర్ కారు కొత్త CMF-B ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. రెనో కంపెనీ దీని డిజైన్‌లో, ఫీచర్లలో అనేక మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు సమాచారం.
2. New Gen Toyota Fortuner Features :టయోటా కంపెనీ బహుశా వచ్చే ఏడాదిలోనే ఈ ఫార్చ్యూనర్ హైబ్రిడ్ కారును అంతర్జాతీయంగా లాంఛ్ చేయవచ్చని సమాచారం. కానీ భారత్‌లో ఎప్పుడు దీనిని లాంఛ్ చేస్తారో స్పష్టంగా తెలియదు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం, ఈ టయోటా ఫార్చ్యూనర్ కారులో, 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో, 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను అనుసంధానం చేసినట్లు సమాచారం. దీనిలో స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్ట్రైన్ అమర్చినట్లు మరికొన్ని వర్గాల సమాచారం. అయితే దీనిపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
3. New Gen Maruti Suzuki Swift And Dzire Features : న్యూ జనరేషన్ మారుతి స్విఫ్ట్ ఇటీవలే జపాన్‌లో లాంఛ్ అయ్యింది. 2024లో భారత్‌లోనూ ఇది లాంఛ్ కానుంది. మారుతి డిజైర్ బహుశా 2024 సెప్టెంబర్‌లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు కార్లు కూడా ఒకే రకమైన పవర్ట్రైన్ ఆప్షన్లతో వస్తాయని సమాచారం. ఈ మారుతి స్విఫ్ట్, డిజైర్ కార్లలో 1.2 లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమరుస్తున్నారు. ఇది 82 bhp పవర్, 108 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కార్లలో మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది 13.5 PS పవర్, 30Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ రెండూ కూడా ఇండియన్ స్పెక్ వేరియంట్లో ఉంటాయని భావించవచ్చు.