Upcoming Cars In India : కొత్తగా కారు కొనాలనుకునే వారు.. బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ కోసం చూస్తుంటారు. రూ.10 లక్షల్లోపు కారును కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతుంటారు. ఆ డిమాండ్‌కు అనుగుణంగా కార్ల తయారీ కంపెనీలు సైతం కొత్త కొత్త మోడళ్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేక ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. అయితే త్వరలో రూ. 10 లక్షల బడ్జెట్‌తో మార్కెట్లోకి రానున్న ఐదు కొత్త కార్ల గురించి తెలుసుకుందాం రండి.
మారుతీ సుజుకీ స్విఫ్ట్ & డిజైర్
Upcoming Cars Under 10 Lakhs : భారతీయ మార్కెట్లో రూ.10 లక్షల బడ్జెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో మారుతీ స్విఫ్ట్, డిజైర్ ముందు వరుసలో ఉంటాయి. ఇప్పుడీ ఈ రెండు మోడళ్ల కొత్త జనరేషన్ల కార్లను 2024లో మారుతీ తీసుకురానుంది. డిజైన్ల మార్పుతో పాటు అనేక కొత్త ఫీచర్లను కూడా జోడించనుంది.
Maruthi Swift Dzire : రెండు మోడళ్ల ఇంజిన్‌లో స్పల్ప మార్పులు ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 1.2 లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పెట్రోల్, సీఎన్జీ.. రెండు ఆప్షన్లు ఉంటాయని అంటున్నారు. ధర కాస్త పెరుగుతుందని.. కానీ రూ.10 లక్షలోపే ఉండే అవకాశం ఉందమని చెబుతున్నారు.
హోండా అమేజ్
Honda Amaze New Model :ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా.. ఈ ఏడాది ద్వితీయార్థంలో అమేజ్ మోడల్ మూడో జనరేషన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. అనేక కొత్త ఫీచర్లను జోడించనుంది. గత మోడల్ కన్నా ఈ కారు కాస్త పొడవు తక్కువగా ఉండనుంది. 1.2 లీటర్ i-VTEC ఇంజిన్‌తో ఈ కొత్త మోడల్ రానుంది. 2024 ప్రమాణాలకు తగ్గట్లు క్యాబిన్లో పలు మార్పులు చేయనుంది.
హ్యుందాయ్ ఎక్స్టర్
Hyundai Exter Model : కొరియన్ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్.. ఈ ఏడాది జులై 10న ఎక్స్‌టెర్ ఎస్‌యూవీని మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఆ కారుకు సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జులై నెలలో ఉత్పత్తి కూడా ప్రారంభం కానుంది. హ్యుందాయ్ మరో మోడల్ గ్రాండ్ ఐ10 నియోస్ మాదిరిగానే అనేక ఫీచర్లు ఉండనున్నాయి. కొత్త మోడల్లో పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లతో 1.2 లీటర్ Kappa ఇంజిన్ ఉండనుంది. ఎక్స్టర్ ఎక్స్ షోరూమ్ ధర దాదాపు రూ. 6 లక్షలు ఉండొచ్చని అంచనా.
మారుతీ సుజుకీ కూపే SUV
Maruti Suzuki Coupe SUV : మారుతీ సుజుకీ- టయోటా.. భారత దేశంలో ఫ్రాంక్స్ తరహా కూపే ఎస్‌యూవీని పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాదిలో Taisor అనే పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫ్రాంక్స్ మోడల్ మాదిరిగానే అనేక ఫీచర్లు ఉంటాయని, కానీ డిజైన్ మారే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.