తెలంగాణ

telangana

ETV Bharat / business

2024లో లాంఛ్​ కానున్న టాప్​-5 సూపర్ స్టైలిష్​ కార్స్ ఇవే!

Upcoming Cars In India 2024 In Telugu : కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మరో 3-4 నెలల్లో మారుతి సుజుకి, టాటా, కియా, హ్యుందాయ్​, టయోటా కంపెనీలు.. తమ లేటెస్ట్ కార్లను విడుదల చేయనున్నాయి. మరెందుకు ఆలస్యం.. ఆ నయా కార్లపై మనమూ ఓ లుక్కేద్దాం రండి.

5 New Cars Launches Within The Next 3 to 4 Months In India
upcoming cars in India 2024

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 5:09 PM IST

Upcoming Cars In India 2024 :కొత్త ఏడాదిలో స్టన్నింగ్ ఫీచర్స్​, స్టైలిష్ లుక్స్​తో.. పలు సరికొత్త మోడల్ కార్లు ఇండియన్​ మార్కెట్లోకి రానున్నాయి. వాటిలో కియా, టాటా, మారుతి సుజుకి, టయోటా, హ్యుందాయ్​లకు చెందిన కార్లు ఉన్నాయి. ఇవన్నీ మరో 3 - 4 నెలల్లో లాంఛ్ కానున్నాయి. అందుకే వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

1. Kia Sonet Car Features :కియా సోనెట్​ డిసెంబర్ 14న భారత్​ మార్కెట్లో లాంఛ్ కానుంది. ఈ సరికొత్త కాంపాక్ట్ ఎస్​యూవీని లేటెస్ట్ ఆపోజిట్​ యునైటెడ్ డిజైన్​ ఫిలాసఫీతో రూపొందించారు. ఫీచర్ల విషయానికి వస్తే.. టాప్​-ఎండ్​ కార్లలో ​ADASతో సహా, పలు స్పెషల్ ఫీచర్లను పొందుపరిచినట్లు తెలుస్తోంది. అలాగే దీనిలోని క్యాబిన్​ను కూడా సూపర్ ప్రీమియం క్వాలిటీతో రూపొందించినట్లు సమాచారం. ప్రస్తుతానికి దీని ధర ఇంకా ప్రకటించలేదు.

కియా సోనెట్​

2. Tata Punch EV Features :దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. త్వరలోనే ఈ పంచ్ ఈవీ కారును ఇండియన్ మార్కెట్​లో లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. నెక్సాన్​ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీల మాదిరిగానే.. దీనిని కూడా జిప్​ట్రాన్​ టెక్నాలజీతో రూపొందించారు. ఈ ఎలక్ట్రిక్​ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. టాటా కంపెనీ ఈ ఈవీ కారు ఇంటీరియర్​లో పలు మార్పులు చేసింది. అంతేకాదు ఎక్స్​టీరియర్​ లుక్స్​లోనూ చాలా మార్పులు చేసినట్లు సమాచారం.

టాటా పంచ్ ఈవీ

3. Maruti Suzuki Swift Features :ఈ న్యూ-జెన్ మారుతి సుజుకి స్విఫ్ట్ కారు ఇప్పటికే పలుమార్లు రోడ్లపై కనిపించింది. మారుతి సుజుకి ఈ కారును మరికొద్ది నెలల్లోనే భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కారు డిజైన్​ను సరికొత్తగా రూపొందించింది. అంతేకాదు కారు ఇంటీరియర్​లోనూ సరికొత్త ఫీచర్లు, టెక్నాలజీలను పొందుపరిచింది. అన్నికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ నయా మారుతి సుజుకి కారు 1.2 లీటర్ల మైల్డ్ హైబ్రీడ్ జెడ్ సిరీస్ ఇంజన్​ ఆప్షన్​తో వస్తుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్

4. Toyota Urban Cruiser Taisor Car Features : మారుతి సుజుకి ఫ్రాంక్స్​ వెర్షన్​ను ఆధారం చేసుకుని టయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్​ను రూపొందించారు. కనుక ఈ రెండు కార్ల మధ్య కొద్దిపాటి కాస్మెటిక్ తేడాలు మాత్రమే ఉంటాయి. ఇక టయోటా కారులోని ఇంజిన్, ఫీచర్లు మొత్తం.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు మాదిరిగానే ఉంటాయి.

టయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్

5. Hyundai Creta Features :హ్యుందాయ్ కంపెనీ 2024 ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఈ క్రెటా కారును ఇండియన్ మార్కెట్​లో విడుదల చేసే అవకాశం ఉంది. హ్యుందాయ్​ ఈ నయా కారు ముందు భాగం డిజైన్​లోనూ సరికొత్త మార్పులు చేసింది. ఇంటీరియర్​లోనూ అనేక కొత్త ఫీచర్లను ఏర్పాటుచేసింది. అంతేకాదు ఈ కారులో లెవెల్-2 ADAS టెక్నాలజీని పొందుపరిచింది.

హ్యుందాయ్ క్రెటా

కొత్త కారు కొనాలా? ఆ మోడల్​పై ఏకంగా రూ.3 లక్షలు డిస్కౌంట్​!

స్టన్నింగ్ ఫీచర్స్​తో టెస్లా Cybertruck లాంఛ్​ - 547 కి.మీ డ్రైవింగ్ రేంజ్ - ధర​ ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details