తెలంగాణ

telangana

ETV Bharat / business

2024లో లాంఛ్​ కానున్న టాప్​-6 కార్లు ఇవే! ఫీచర్స్, లుక్స్​ అదుర్స్​! - Most Anticipated Upcoming Cars In India 2024

Upcoming Cars In India 2024 : కార్ లవర్స్​కు గుడ్ న్యూస్​. 2024లో మారుతి సుజుకి, టాటా, టయోటా, మహీంద్రా, కియా కంపెనీలు తమ లేటెస్ట్ కార్లను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అదిరే ఫీచర్లతో, సూపర్ స్పెసిఫికేషన్స్​తో.. అందుబాటు ధరలో తమ బ్రాండెడ్​ కార్లను తీసుకురానున్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

Upcoming Cars In 2024
Upcoming Cars In India 2024

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2023, 12:11 PM IST

Upcoming Cars In India 2024 : భారత్​లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా బాగా అభివృద్ధి చెందుతోంది. పెరుగుతున్న డిమాండ్​కు, వినియోగదారుల అభిరుచులకు అనుగణంగా సరికొత్త కార్లను రూపొందించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా అందుబాటు ధరల్లోనే.. మంచి ఫీచర్లతో, స్టైలిష్ డిజైన్లతో తమ కార్లను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఈ పోటీలో మారుతి సుజుకి, టాటా మోటార్స్​, టయోటా, కియా, మహేంద్ర లాంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి.

అప్​కమింగ్ కార్స్​ : 2024లో మారుతి సుజుకి కంపెనీ స్విఫ్ట్​, డిజైర్ కార్లను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టాటా కంపెనీ పంచ్ ఎలక్ట్రిక్​ కారును, టయోటా - టైసర్, కియా - సోనెట్​, మహీంద్రా - XUV300 కార్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. అందుకే వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

Mahindra XUV300 Features :మహీంద్రా కంపెనీ 2024 ప్రారంభంలోనే తన లేటెస్ట్ XUV300 కారును లాంఛ్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఇప్పటికే అగ్రెసివ్​గా రోడ్ టెస్ట్​లు చేస్తోంది.

మహీంద్రా ఎక్స్​యూవీ 300

మహీంద్రా కంపెనీ ఈ నయా కారు డిజైన్​లో, ఫీచర్లలో పలుమార్పులు చేసింది. ముఖ్యంగా కారులో పనోరమిక్​ సన్​రూఫ్​ను ఏర్పాటుచేసింది. అంతేకాకుండా 6-స్పీడ్​ టార్క్ -​ కన్వర్టర్​ ఆటోమేటిక్ గేర్​ బాక్స్​, రీడిజైన్డ్​ డ్యాష్​బోర్డ్​, వైర్​లెస్​ ఫోన్​ ఛార్జర్​, వెంటిలేటెడ్ ఫ్రంట్​ సీట్స్​, డిజిటల్​ డ్రైవర్​ డిస్​ప్లేలను కూడా ఈ కారులో అమర్చింది. XUV700 డిజైన్​ ప్రేరణతో ఈ XUV300 కారును స్పోర్టియర్ డిజైన్​తో రూపొందించింది.

మహీంద్రా ఎక్స్​యూవీ 300

Mahindra XUV300 Price : ఈ మహీంద్రా ఎక్స్​యూవీ300 కారు ధర రూ.8 లక్షలు ఉండవచ్చు అని అంచనా.

మహీంద్రా ఎక్స్​యూవీ 300

Maruti Suzuki Swift and Dzire :మారుతి సుజుకి కంపెనీ 2024లో స్విఫ్ట్, డిజైర్​ కార్లను లాంఛ్ చేయనుంది. వీటిలో స్ట్రాంగ్​ హైబ్రీడ్ టెక్నాలజీతో.. 1.2 లీటర్​ 3 సిలిండర్​ పెట్రోల్ ఇంజిన్​ను అమర్చారు. ఈ కార్లు ఏకంగా 35 kmpl మైలేజ్​ ఇస్తాయని తెలుస్తోంది. ఈ హ్యాచ్​బ్యాక్​-సెడాన్ కార్ల లోయర్​ వేరియంట్లు 1.2 లీటర్ డ్యూయెల్​జెట్​ పెట్రోల్​, సీఎన్​జీ పవర్​ట్రైన్​ ఆప్షన్లతో రానున్నాయి.

Maruti Suzuki Swift Price : మారుతి సుజుకి స్విఫ్ట్​ కార్​ ధర రూ.6 లక్షల వరకు ఉండవచ్చు.

మారుతి సుజుకి స్విఫ్ట్​
మారుతి సుజుకి స్విఫ్ట్​
మారుతి సుజుకి స్విఫ్ట్​

Maruti Suzuki Dzire Price : మారుతి సుజుకి డిజైర్​ కార్​ ధర రూ.6.5 లక్షల వరకు ఉండవచ్చు.

మారుతి సుజుకి డిజైర్​
మారుతి సుజుకి డిజైర్​
మారుతి సుజుకి డిజైర్​

Kia Sonet Facelift Features : ఈ కియా సోనెట్ కారు 2024లోనే లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారులో అడ్వాన్స్​డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్​ (ADAS) టెక్నాలజీ అమర్చారని సమాచారం. అంతేకాదు కారులోపల న్యూ డ్యాష్​బోర్డ్​, డ్యూయెల్​-స్క్రీన్​ సెటప్​, 360-డిగ్రీ కెమెరాలను కూడా పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ కియా సోనెట్​ కార్​ను 1.2 లీటర్​ పెట్రోల్​, 1.0 లీటర్​ టర్బో పెట్రోల్​, 1.5 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఆప్షన్లతో తీసుకురానున్నారు.

కియా సోనెట్​
కియా సోనెట్​

Kia Sonet Price :కియా సోనెట్​ ధర రూ.7.8 లక్షల వరకు ఉంటుందని నిపుణుల అంచనా.

కియా సోనెట్​

Toyota Taisor Features :టయోటా 2022లో అర్బన్ క్రూయిజర్​ను నిలిపివేసింది. దాని స్థానంలో ఇప్పుడు టైసర్ కారును తీసుకురానుంది. వాస్తవానికి ఈ కారు.. మారుతి సుజుకి ఫ్రాంక్స్​కు చెందిన రీ-బ్యాడ్జెడ్​ వెర్షన్​. టయోటా సిగ్నేచర్​ గ్రిల్​, ట్వీక్డ్​ బంపర్​లు, ప్రత్యేకమైన వీల్స్​తో ఇది చూడడానికి సూపర్​ స్టైలిష్ లుక్​లో ఉంటుంది.

టయోటా ఈ టైసర్ కారు ఇంటీరియర్​లోనూ, కలర్​ స్కీమ్​లోనూ సరికొత్త మార్పులు తీసుకువస్తోంది. అంతేకాదు ఈ కారును 1.2 లీటర్​ పెట్రోల్​ మోటార్​, 1.0 లీటర్​ టర్బో-పెట్రోల్ మోటార్ ఆప్షన్లతో తీసుకువస్తోంది.

Toyota Taisor Price : ఈ టయోటా టైసర్​ కారు ధర సుమారుగా రూ.8 లక్షల వరకు ఉండవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

టయోటా టైసర్​

Tata Punch EV Features : 2023 చివరిలో టాటా కంపెనీ.. పంచ్ ఈవీ కారును లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కారు పలుమార్లు రోడ్ టెస్టింగ్​ చేస్తున్నప్పుడు కనిపించింది. ఈ ఎలక్ట్రికల్​ మైక్రో ఎస్​యూవీ కారును.. మీడియం రేంజ్​, లాంగ్ రేంజ్​ అనే రెండు వేరియంట్లలో తీసుకువచ్చేందుకు టాటా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ కార్లలోని బ్యాటరీలను ఒకసారి ఫుల్ రీఛార్జ్​ చేస్తే 200 కి.మీ, 300 కి.మీ రేంజ్​ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

Tata Punch EV Price : టాటా పంచ్ ఈవీ కారు ధర రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా.

టాటా పంచ్ ఈవీ

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన టాప్​-10 కార్లు ఇవే!

బజాజ్ బైక్​ కొనాలా? త్వరలో లాంఛ్​ కానున్న లేటెస్ట్ టూ-వీలర్స్​పై ఓ లుక్కేయండి!

ABOUT THE AUTHOR

...view details