Upcoming Cars In India 2023 : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ పండగల సీజన్లో సరికొత్త కార్లను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సంసిద్ధం అవుతున్నాయి. ఎందుకంటే ఆ సమయంలో ఆటోమొబైల్ సేల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రముఖ కార్ల కంపెనీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి.
ఇప్పుడు మనం పండగ సీజన్లో విడుదల కానున్న టాప్ 5 కారుల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా రూ.15 లక్షల బడ్జెట్లోని కార్లపై ఓ లుక్కేద్దాం.
1. టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ :
TATA Nexon Facelift :2023లో టాటా మోటార్స్ కంపెనీ నుంచి రానున్న బెస్ట్ కారు నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్. ఈ అప్డేటెడ్ ఎస్యూవీ కార్లలో సరికొత్త మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం. ముఖ్యంగా కర్వ్ ICE కాన్సెప్ట్ స్ఫూర్తితో.. నెక్సాన్ కార్ డిజైన్‌ను రూపొందిస్తున్నారు. 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో కూడిన న్యూ క్యాబిన్ లేవుట్ దీనిలో పొందుపరిచారు. అలాగే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో అమర్చనున్నారు.
- టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌లో సరికొత్త 1.2 లీటర్ tGDi పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 125 bhp పవర్, 225 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.
- టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ధర.. దాని ముందటి వెర్షన్ కంటే కచ్చితంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్‌లో ఈ నయా కారు మార్కెట్లో విడుదల అయ్యే అవకాశం ఉంది.
2. హోండా ఎలివేట్
Honda Elevate : హోండా కంపెనీ తన మిడ్-సైజ్ ఎస్యూవీ కారు హోండా ఎలివేట్మోడల్ను జూన్‌లో ప్రజలకు చూపించింది. ఈ కారును సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఎస్యూవీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఒకసారి ధర నిర్ణయించిన తరువాత.. వెంటనే డెలివరీలు ప్రారంభించే అవకాశం ఉంది.
హోండా ఎలివేట్‌లో 1.5 లీటర్ i-VTEC ఇంజిన్ ఉంది. ఇది 121 bhp పవర్, 145 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ధర విషయానికి వస్తే.. ప్రారంభ ధర బహుశా రూ.11 లక్షలు (ఎక్స్-షోరూం) ఉండే అవకాశం ఉంది.
3. టయోటా రూమియన్
Toyota Rumion : మారుతి సుజుకి కార్‌ను రీబ్యాడ్జ్ చేసి.. టయోటా నేమ్‌ప్లేట్‌తో.. టయోటా రూమియన్ కారును భారత మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టయోటా కంపెనీ ఇప్పటికే ఈ MVP కారును అలాగే దాని వేరియంట్లను పరిచయం చేసింది.
టయోటా రూమియన్ కారు వాస్తవానికి మారుతి సుజుకి ఎర్టిగా బేస్డ్ MVP. దీనిని సెప్టెంబర్ నెలలో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. టయోటా ఇప్పటికే ఎర్టిగా బేస్డ్ రూమియన్ కారును దక్షిణ ఆఫ్రికాలో విడుదల చేసింది. వాస్తవానికి ఈ కారును మారుతి సుజుకి ఇండియాలో తయారుచేసి, దక్షిణాఫ్రికాకు ఎగుమతి చేసింది.